రవిశాస్త్రినే మళ్లీ కోచ్‌గా కొనసాగిస్తే తాను సంతోషిస్తానని విరాట్ కోహ్లీ ఇటీవలే అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు మాజీ సారథి సౌరవ్ గంగూలీ కూడా కోహ్లీకే మద్దతు పలికాడు. కోచ్‌గా ఎవరు కావాలో విరాట్‌కు అడిగే హక్కు ఉందని చెప్పాడు.
"భారత క్రికెట్ జట్టుకు విరాట్ కోహ్లీ సారథి. కాబట్టి కోచ్‌గా ఎవరు కావాలో అతడికి అడిగే హక్కు ఉంటుంది.
-సౌరవ్ గంగూలీ, టీమిండియా మాజీ కెప్టెన్
2017లో రవిశాస్త్రిని కోచ్‌గా ఎంపిక చేసిన కమిటీలో గంగూలీ కూడా ఓ సభ్యుడు. ప్రస్తుతం కపిల్‌దేవ్ నేతృత్వంలోని సలహా బృందం టీమిండియా కోచ్, తదితర సిబ్బంది పదవులకు నియామకాన్ని చేపట్టింది. ఆగస్ట్ రెండో వారంలో కోచ్ ఎవరనేది ప్రకటించనుంది.
ఇది చదవండి: కోచ్‌గా రవిశాస్త్రి ఉంటేనే ఉత్తమం: కోహ్లి