ఇటీవల ఐసీసీ ఛైర్మన్ పదవికి పోటీ చేసిన ఇమ్రాన్ ఖవాజాతో పాటు మహింద వల్లిపురం మండలి అసోసియేట్ సభ్య డైరెక్టర్లుగా తిరిగి ఎన్నికయ్యారు. వీరితో పాటు నీల్ స్పీట్ కొత్తగా ఈ పదవిని చేపట్టనున్నాడు. ఐసీసీ ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఓటింగ్‌లో సభ్యులు ఈ ముగ్గురిని ఎన్నుకున్నారు.
"ఈనెల 14న మొదలైన ఓటింగ్ ఈ శుక్రవారంతో ముగిసింది. ఇమ్రాన్ ఖవాజాకు అత్యధికంగా 34 ఓట్లు రాగా.. మహిందకు 19, స్పీట్‌కు 16 ఓట్లు వచ్చాయి" అని ఐసీసీ తెలిపింది. స్పీట్ గతంలో బెర్ముడా క్రికెట్ బోర్డుకు సీఈఓగా పని చేశారు.
"అసోసియేట్ సభ్య డైరెక్టర్లుగా ఎంపికైన ఖవాజా, మహింద, స్పీట్‌కు అభినందనలు. ఇమ్రాన్, మహిందతో తిరిగి పని చేసుందుకు ఉత్సాహంగా ఉన్నా" అని ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్‌లే అన్నారు.
ఇదీ చూడండి: రవిశాస్త్రిని తప్పించండి- దాదాకు నెటిజన్ల అభ్యర్థన