ETV Bharat / sports

ఒక్క సెంచరీతో విలియమ్సన్ రెండు రికార్డులు - 2021లో తొలి సెంచరీ

పాకిస్థాన్​తో జరుగుతోన్న రెండో టెస్టులో న్యూజిలాండ్ కెప్టెన్​ కేన్​ విలియమ్సన్​ సెంచరీ నమోదు చేశాడు. దీంతో టెస్టుల్లో వరుసగా మూడు శతకాలు సాధించిన ఆటగాడిగా ఘనత సాధించడం సహా.. ఈ దశాబ్దంలో తొలి అంతర్జాతీయ సెంచరీ చేసిన క్రికెటర్​గా నిలిచాడు.

Kane Williamson becomes first international centurion of 2021
ఒక్క సెంచరీతో విలియమ్సన్​కు రెండు రికార్డులు
author img

By

Published : Jan 4, 2021, 4:03 PM IST

2020 ఏడాదిని సెంచరీతో ముగించి.. కొత్త ఏడాదిలో మరో శతకంతో అదరగొట్టాడు న్యూజిలాండ్​ కెప్టెన్​ కేన్​ విలియమ్సన్​. గతేడాది సెంచరీతో బ్యాట్స్​మన్​గా టెస్టు ర్యాంకింగ్స్​లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. తాజాగా ఈ దశాబ్దపు తొలి సెంచరీని చేసి రికార్డులకెక్కాడు.

క్రైస్ట్​చర్చ్​ వేదికగా పాకిస్థాన్​తో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో 175 బంతులను ఎదుర్కొన్న విలియమ్సన్.. 112 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు. ఈ మ్యాచ్​లో మొత్తంగా 16 ఫోర్లు బాదాడు. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయిన కివీస్​ జట్టు 286 పరుగులు చేసింది. ప్రస్తుతం పాక్​ జట్టు కంటే 11 రన్స్ వెనుకబడి ఉంది.

వరుసగా మూడు టెస్టుల్లో సెంచరీ చేసిన నాలుగో కివీస్​ ఆటగాడిగా ఘనత సాధించాడు విలియమ్సన్​. ఇతడి కంటే ముందు ఆ దేశానికి చెందిన మార్క్​ బర్గీస్​ (1969-72), రాస్​ టేలర్​ (2013), టామ్​ లాథమ్​ (2018-19)లు ఉన్నారు.

ఆరు దశాబ్దాలుగా తొలి అంతర్జాతీయ సెంచరీ చేసిన ఆటగాళ్లు

1971 - బాయ్​కాట్​

1981 - గ్రెగ్​ చాపెల్

1991 - గ్రెగ్​ మాథ్యూస్​

2001 - డారిల్ కుల్లినన్

2011 - జాక్​ కలిస్​

2021 - కేన్​ విలియమ్సన్​*

ఇదీ చూడండి: 'రోహిత్​ను ఔట్ చేయడం పెద్ద సవాల్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.