ETV Bharat / sports

వైరల్: క్వారంటైన్​ కేంద్రంలో క్రికెట్ ఆడుతూ కాలక్షేపం​ - దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్​ జాంటీ రోడ్స్​

నెట్టింట వైరల్​గా మారిన క్వారంటైన్​ క్రికెట్​ వీడియోను దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్​ జాంటీ రోడ్స్​ షేర్​ చేశాడు. భారతీయులు క్రికెట్​పై చూపుతున్న అభిమానానికి తాను ఫిదా అయ్యానని తెలిపాడు. అందుకే భారత్​ను అంతలా ఇష్టపడతానని స్పష్టం చేశాడు.

Jonty Rhodes Shares Viral Video Of People Playing Cricket In Quarantine Centre
క్వారంటైన్​ కేంద్రంలో క్రికెట్​ ఆడుతున్న వీడియో వైరల్​
author img

By

Published : Jun 11, 2020, 4:30 PM IST

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్​ జాంటీ రోడ్స్​కు భారతదేశంపై ఎందుకు అంత ప్రేమ ఉందో తాజాగా ఓ వీడియో షేర్​ చేస్తూ వెల్లడించాడు. క్వారంటైన్​ సెంటర్​లోనూ క్రికెట్​ ఆడుతున్న వీడియో నెట్టింట విపరీతంగా వైరల్​ అవుతోంది. దీన్ని గతంలో జమ్ము కశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి ఒమర్​ అబ్దుల్లా ట్విట్టర్​లో షేర్​ చేశారు.

"ఇండియాను నేను ఎందుకు అంతలా ప్రేమిస్తానో ఇంతకన్నా చెప్పనవసరం లేదు అనుకుంటా" అనే క్యాప్షన్​తో ట్విట్టర్​లో వీడియో షేర్​ చేశాడు జాంటీ రోడ్స్​.

కరోనా మహమ్మారి కారణంగా మార్చిలో జరగాల్సిన దక్షిణాఫ్రికా, భారత్​ సిరీస్​ వాయిదా పడింది. ఆ తర్వాత మార్చి 29 నుంచి జరగాల్సిన ఐపీఎల్​నూ నిరవధిక వాయిదా వేశారు. తాజాగా ఈ ఏడాది కచ్చితంగా ఐపీఎల్​ను నిర్వహిస్తామన్నారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. రాష్ట్రాలు అందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. త్వరలో టోర్నీ నిర్వహణపై స్పష్టతనిస్తామని చెప్పారు.

ఇదీ చూడండి... ఐపీఎల్​కు సిద్ధంగా ఉండండి: గంగూలీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.