ఏ జట్టులోనైనా టెయిలెండర్లు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించడం అరుదు. కానీ, టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుకు భిన్నంగా అర్ధశతకాన్ని నమోదు చేశాడు. ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతోన్న రెండో సన్నాహాక మ్యాచ్ తొలి రోజున హాఫ్‌సెంచరీతో అలరించాడు. భారత జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో అతడు చేసిన 50 పరుగులు జట్టు స్కోరు బోర్డుకు కొంతమేరకు సాయపడ్డాయి.
-
Jasprit Bumrah reaches his maiden first-class fifty with a SIX in the practice match against Australia A 👀pic.twitter.com/WGrG4fQnyD
— ICC (@ICC) December 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Jasprit Bumrah reaches his maiden first-class fifty with a SIX in the practice match against Australia A 👀pic.twitter.com/WGrG4fQnyD
— ICC (@ICC) December 11, 2020Jasprit Bumrah reaches his maiden first-class fifty with a SIX in the practice match against Australia A 👀pic.twitter.com/WGrG4fQnyD
— ICC (@ICC) December 11, 2020
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రహానె టీమ్ ఆదినుంచే తడబడుతూ ఆడింది. ఓపెనర్ పృథ్వీషా (40), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్ (43) పర్వాలేదనిపించినా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ పరుగులను రాబట్టడంలో విఫలమయ్యారు. వృద్ధిమాన్ సాహా, మహ్మద్ షమీ డకౌట్‌గా వెనుదిరిగారు. అయితే ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అర్ధశతకంతో అలరించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 57 బంతులను ఆడిన బుమ్రా.. ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో తన తొలి హాఫ్‌సెంచరీని నమోదు చేసుకుని నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 194 పరుగులకే టీమ్ఇండియా ఆలౌటైంది.
కీలక ఆటగాళ్లకు విశ్రాంతి
ఆస్ట్రేలియా ఎ జట్టుతో ప్రారంభమైన పింక్‌బాల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా అనుహ్య నిర్ణయాలు తీసుకుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్ లాంటి ప్రధాన బ్యాట్స్‌మెన్‌కు విశ్రాంతినిచ్చింది. మరోవైపు తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేని స్పిన్నర్లనూ ఈ మ్యాచ్‌లో పూర్తిగా పక్కనపెట్టింది.
టీమ్‌ఇండియా 2019 నవంబర్‌లో కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలిసారి బంగ్లాదేశ్‌తో పింక్‌బాల్ టెస్టు ఆడింది.
ఇదీ చూడండి: ఫిట్నెస్ పరీక్షలో రోహిత్ పాస్.. త్వరలో ఆసీస్‌కు