2019 ప్రపంచకప్ నాటకీయ పరిణామాల మధ్య ముగిసి క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. సూపర్ ఓవర్ 'టై' అవడం వల్ల బౌండరీ కౌంట్ ద్వారా ఇంగ్లాండ్ జట్టు విశ్వవిజేతగా అవతరించింది. కివీస్‌కు మరోసారి చేదు అనుభవాన్ని మిగిల్చింది. దీనిపై తాజాగా న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్.. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేసినా జట్టుకు ఫలితం కఠినంగా వచ్చిందని అభిప్రాయపడ్డాడు.
"జరిగిన దాన్ని అంగీకరించి ముందుకు సాగాలి. తుదిపోరులో మేము సరైన ఫలితాన్ని పొందలేకపోయాం. అది ఒక అద్భుతమైన ఆట. మేము అందులో భాగం కాబట్టి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి మరికొంత సమయం పడుతుంది".
-కేన్ విలియమ్సన్, న్యూజిలాండ్ కెప్టెన్
ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్లో కొన్ని అవకాశాలు చేయి దాటి పోయాయని.. వాటిని ఆధీనంలోకి తెచ్చుకునే లోపే పరిస్థితులు తారుమారు అయ్యాయని విలియమ్సన్ అన్నాడు. అయినా ఆ మ్యాచ్ ఒక మర్చిపోలేని అనుభవమని తెలిపాడు. ప్రపంచకప్‌లో కేన్ 578 పరుగులు సాధించి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచాడు.
ఇదీ చూడండి.. 'కోహ్లీ కంటే సచినే ఉత్తమ క్రికెటర్'