ఆస్ట్రేలియా టెస్టు అరంగేట్రం చేయడం.. యుద్ధానికి వెళ్లిట్లనిపించిందని యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ పేర్కొన్నాడు. "మా ఫీల్డింగ్ అయిపోయేంత వరకు నేను మామూలుగానే ఉన్నా. కానీ బ్యాటింగ్ సమయానికే ఉద్వేగం మొదలైంది. ప్రేక్షకుల సందడి మధ్య డ్రెస్సింగ్ రూమ్ నుంచి పిచ్ వైపు నడుస్తుంటే యుద్ధానికి వెళ్తున్నట్లే అనిపించింది" అని శుభ్మన్ తెలిపాడు.
టెస్టుల్లో అరంగేట్రంతో తన చిన్ననాటి కల నెరవేరిందని గిల్ వెల్లడించాడు. "చిన్నప్పుడు తెల్లవారుజామున 4.40-5కే లేచి ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్లు చూసేవాడిని. ఇప్పుడు నా ఆట చూసేందుకు జనం త్వరగా నిద్ర లేస్తున్నారు. అదో గొప్ప అనుభూతి" అని 21 ఏళ్ల శుభ్మన్ అభిప్రాయపడ్డాడు. చాలా మంది ఆటగాళ్లు గాయపడ్డప్పటికీ ఆస్ట్రేలియాతో సిరీస్ ఆసాంతం జట్టు సానుకూల దృక్పథంతో ఉందని తెలిపాడు. ఆస్ట్రేలియాతో మెల్బోర్న్లో జరిగిన రెండో టెస్టులో శుభ్మన్ అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్లో అతడు 259 పరుగులు సాధించాడు.
ఇదీ చదవండి: ఐఓసీ అధ్యక్షుడిగా మరోసారి థామస్ బాక్