ETV Bharat / sports

పుట్టినరోజున ప్రపంచకప్​ అందుకుంటుందా..? - harman preet kaur news birthday

మహిళా టీ20 ప్రపంచకప్​లో ఫైనల్​ చేరింది టీమిండియా. ఈ జట్టుకు సారథ్యం వహిస్తున్న హర్మన్​ప్రీత్​ కౌర్​ అరుదైన ఘనత సాధించబోతుంది. పుట్టినరోజు నాడే (మార్చి 8) ఫైనల్​ ఆడుతున్న ఏకైక కెప్టెన్​గా చరిత్ర సృష్టించనుంది.

Is She Getting the T20 World Cup on Harman Preet birthday
పుట్టినరోజున ప్రపంచకప్​ అందుకుంటుందా..?
author img

By

Published : Mar 6, 2020, 5:32 AM IST

Updated : Mar 6, 2020, 7:06 AM IST

హర్మన్​ప్రీత్​ కౌర్​.. ప్రస్తుతం టీమిండియా మహిళా టీ20 జట్టు కెప్టెన్​. అయితే ఈ మెగాటోర్నీలో తాజాగా ఫైనల్​ చేరింది భారత్​. ఫలితంగా మార్చి 8న మెల్​బోర్న్​ వేదికగా తుదిపోరులో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇదే రోజున ఈ క్రికెటర్​ పుట్టినరోజు కావడం వల్ల టీమిండియాలో మరింత జోష్​ పెరిగింది. ఆమెకు కప్​ను బహుమతిగా ఇవ్వాలని సహఆటగాళ్లు భావిస్తున్నారు. ఇప్పటివరకు చరిత్రలో ఏ క్రికెటర్​ బర్త్​డే రోజున టైటిల్​ పోరు జరగలేదు. ఈ ఘనత సాధించిన తొలి మహిళ హర్మన్​ కావడం విశేషం. ఇదే రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం అవ్వడం గమనార్హం.

Is She Getting the T20 World Cup on Harman Preet birthday
ఎంఎస్​ ధోనీ, హర్మన్​ప్రీత్​

ఇద్దరి జెర్సీ ఒక్కటే...

కపిల్​దేవ్​ తర్వాత 28 ఏళ్లకు ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్​ తెచ్చాడు ధోనీ. అతడి జెర్సీ నెంబర్​ 7. తాజాగా ఫైనల్​కు చేరిన టీమిండియా సారథి హర్మన్​ జెర్సీ నెంబర్​ 7. ఈ నేపథ్యంలో మహీ హిస్టరీ.. హర్మన్​ రిపీట్​ చేస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇదీ చూడండి.. టీ20 మహిళా ప్రపంచకప్: దక్షిణాఫ్రికా లక్ష్యం 135

Last Updated : Mar 6, 2020, 7:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.