ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో సిక్సర్ల మెరుపులు ఊహించారు అభిమానులు. అయితే వారికి కాస్త నిరాశే మిగిలింది. ప్రారంభ మ్యాచ్‌లో బెంగళూరు చెన్నై ధాటికి 70 పరుగులకే ఆలౌటైంది. స్నిన్నర్ల దెబ్బకు ఆర్సీబీ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ధోనీ సేన బెంగళూరుని ఎక్కాడ కోలుకోనివ్వలేదు.
ఓపెనర్ కోహ్లీ వికెట్ తీసిన హర్భజన్ అనంతరం మొయిన అలీ, డివిలియర్స్‌ను పెవిలియన్ చేర్చాడు. డివిలియర్స్ ఔటైన తర్వాత మిగతా బ్యాట్స్‌మెన్ ఎంతోసేపు నిలవలేదు. తాహిర్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.
- బెంగళూరు ఒపెనర్ పార్థివ్ పటేల్(29) మినహా ఎవ్వరూ రాణించలేదు. పార్థివ్ అత్యధిక వ్యక్తిగత పరుగులను నమోదు చేశాడు. కోహ్లీ, మొయిన్ అలీ, డివిల్లీయర్స్, హిట్మైర్, గ్రాండ్ హోమ్, శివమ్ దుబే సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
మొదట భజ్జీ, తర్వాత తాహిర్:
మొదట కోహ్లీ, మొయిన్ అలీ, డివిలియర్స్ వికెట్లు తీసి బెంగళూరును దెబ్బతీశాడు హర్భజన్. అనంతరం తాహిర్ విజృభించి మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. శివమ్ దుబే, సైనీ, యజువేంద్ర చాహాల్ వికెట్లను తీశాడు ఇమ్రాన్. వీరిద్దరే ఆర్సీబీ టాప్ఆర్డర్ని కుప్పకూల్చారు. జడేజాకు 2 వికెట్లు దక్కాయి.