చెన్నై వేదికగా జరుగుతోన్న ఐపీఎల్ వేలంలో ఆసీస్ యువ ఆల్‌రౌండర్ రిలే మెరిడిత్ రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాడు. పంజాబ్ జట్టు ఇతడిని రూ.8 కోట్లకు సొంతం చేసుకుంది. రూ.40 లక్షల కనీస విలువ జాబితాలో ఉన్న ఈ ఆటగాడు అనూహ్యంగా అధిక ధర పలికాడు. ఐపీఎల్ చరిత్రలో ఓ అన్క్యాప్డ్ విదేశీ క్రికెటర్‌కు ఇంత ధర పలకడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు జోఫ్రా ఆర్చర్ (7.2 కోట్లు) పేరిట ఈ రికార్డు ఉండేది.
భారత యువ బౌలర్ చేతన్ సకరియాను రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. రూ.20 లక్షల బేస్ ప్రైస్‌తో ఉన్న ఈ ఆటగాడు రూ.1.20 కోట్లకు అమ్ముడయ్యాడు.
కాగా, సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ జగదీష్ సుచిత్‌ను రూ.20 లక్షల కనీస ధరకు దక్కించుకుంది.