ETV Bharat / sports

వాంఖడేలో మరో ముగ్గురు సిబ్బందికి కరోనా

ఐపీఎల్​కు ముందు కరోనా కలకలం రేపుతోంది. తాజాగా మరో ముగ్గురు వాంఖడే సిబ్బందికి కొవిడ్ నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని ముంబయి క్రికెట్ అసోసియేషన్​ ధ్రువీకరించింది.

author img

By

Published : Apr 6, 2021, 11:59 AM IST

IPL 2021: 2 more groundstaff, one plumber test positive for Covid-19 at Wankhede
మరో ముగ్గురు వాంఖడే సిబ్బందికి కొవిడ్

ఐపీఎల్​లో కొవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా వాంఖడే స్టేడియంలోని లీగ్​తో సంబంధమున్న మరో ముగ్గురికి కరోనా నిర్ధరణ అయింది. అందులో ఇద్దరు గ్రౌండ్​ సిబ్బంది కాగా మరొక్కరు ప్లంబర్​. ఇటీవల ఇదే మైదానపు సిబ్బంది 10 మందికి పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ముంబయి క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ)​ ధ్రువీకరించింది.

ఇదీ చదవండి: 'ముంబయిలో ఐపీఎల్ మ్యాచ్​లకు అనుమతిచ్చాం'

ముంబయి వేదికగా జరగాల్సిన ఐపీఎల్​ మ్యాచ్​లు ముగిసే వరకు.. మిగతా గ్రౌండ్​ సిబ్బందిని వాంఖడే మైదానంలోని క్లబ్​హౌస్​లో ఉంచుతామని ఎంసీఏ తెలిపింది.

ముంబయిలో కేసులు పెరుగుతున్నా వేదికను మార్చాల్సిన అవసరం లేదని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ కూడా ఈ విషయంపై స్పందించారు. లీగ్​ నిర్వహణకు ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు.

ఇదీ చదవండి: 'షెడ్యూల్‌ ప్రకారమే ఐపీఎల్ నిర్వహణ‌'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.