ఐపీఎల్లో పాల్గొనడానికి శుక్రవారం యూఏఈ పయనమవనుంది ముంబయి ఇండియన్స్ జట్టు. ఆటగాళ్లు తమ ప్రయాణానికి సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దుబాయ్ వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సోషల్‌మీడియాలో పోస్టులు చేశారు.
- View this post on Instagram
Got my packer in chief to help me get ready for the UAE 😄 Thanks, Sammy 🥰
">
అందులో కెప్టెన్ రోహిత్‌శర్మ చేసిన పోస్ట్ అభిమానులను అమితంగా ఆకర్షిస్తోంది. దుబాయ్ వెళ్లేందుకు బ్యాగ్ సర్దుకోవడానికి తన కుమార్తె సమైరా సహాయం తీసుకున్నట్లు రోహిత్ పోస్ట్ చేశాడు. తన క్రికెట్ కిట్‌ను సమైరా ఆసక్తిగా చూస్తుందని తెలిపాడు. "యూఏఈ కోసం సిద్ధమవ్వడానికి ప్యాకర్ ఇన్ చీఫ్ వచ్చింది. థ్యాంక్స్ సామి" అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశాడు రోహిత్.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
కరోనా నుంచి తమను తాము రక్షించుకోవడానికి జట్టులోని ఆటగాళ్లతో సహా ఫ్రాంఛైజీ అధికారులూ పూర్తిగా బాడీ సూట్లు, షూ కవర్లు, గ్లౌజ్‌లు, మాస్క్‌లు, కళ్లద్దాలు ధరించారు. ఆ వేషధారణలో పాండ్యా సోదరులు ఓ ఫొటోను షేర్ చేశారు. "మా కొత్త ట్రావెల్ కిట్‌తో యూఏఈ వెళ్లడానికి సిద్ధమయ్యాం" అని పోస్ట్ పెట్టాడు కృనాల్ పాండ్యా.
యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు జరగనుంది. మొత్తం 53 రోజుల పాటు లీగ్ క్రికెట్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించనుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు ఇప్పటికే యూఏఈ చేరుకున్నాయి. ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శుక్రవారం సాయంత్రానికి చేరుకుంటాయి. మిగిలిన సన్‌రైజర్స్ హైదరాబాద్, దిల్లీ క్యాపిటల్స్ జట్లు శనివారం పయనమవ్వనున్నాయి.