చెన్నై సూపర్‌కింగ్స్‌తో రాజస్థాన్ ఆడబోయే తొలి మ్యాచ్‌కు ఆ జట్టు ప్రముఖ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ అందుబాటులో ఉండట్లేదు. బీసీసీఐ నిబంధనల ప్రకారం అతడు ఇంకా క్వారంటైన్లో ఉండటమే ఇందుకు కారణం.
-
Jos buttler to miss First match for rajasthan against csk due to quarantine rule pic.twitter.com/38LG0QtSPl
— AzZaM BeinG ✨SiDNaAz✨ (@AjjuAzzam) September 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Jos buttler to miss First match for rajasthan against csk due to quarantine rule pic.twitter.com/38LG0QtSPl
— AzZaM BeinG ✨SiDNaAz✨ (@AjjuAzzam) September 20, 2020Jos buttler to miss First match for rajasthan against csk due to quarantine rule pic.twitter.com/38LG0QtSPl
— AzZaM BeinG ✨SiDNaAz✨ (@AjjuAzzam) September 20, 2020
"ఐపీఎల్లో ఆడటానికి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో పాల్గొన్నాను. ఇప్పుడు దేశం దాటి బయటకొచ్చి ఆడటానికి సిద్ధం అవుతుంటే ఎంతో ఆనందంగా ఉంది. శనివారం రాత్రి జరిగిన మ్యాచులో విజయం సాధించిన చెన్నై జట్టులో సామ్ కరన్ సిక్సర్లతో అదరగొట్టాడు. మా జట్టు తరఫున టామ్ కరన్ కూడా సిక్సర్లు కొట్టాలని అతడితో చెప్పాను. నేను క్వారంటైన్లో ఉండటం వల్ల సీఎస్కేతో జరిగే తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండను. చాలా బాధగా ఉంది."
-జోస్ బట్లర్, రాజస్థాన్ బ్యాట్స్‌మన్
తర్వాతి మ్యాచుల్లో తాను ఏ స్థానంలో ఆడాలనే విషయంపై జట్టు సారథి స్టీవ్ స్మిత్ పూర్తి స్పేచ్ఛనిచ్చాడని తెలిపాడు బట్లర్.
ఇటీవల ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆడాడు జోస్ బట్లర్. అక్కడి నుంచి ఐపీఎల్ కోసం దుబాయ్ చేరుకున్నాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఈ సీజన్లో పాల్గొనే ఇంగ్లీష్-ఆసీస్ ఆటగాళ్లు 36 గంటలపాటు క్వారంటైన్లో ఉండాలి. ఈ కారణంతో ప్రస్తుతం జాస్ కుటుంబంతో సహా నిర్బంధంలో ఉన్నాడు. సీఎస్కేతో రాజస్థాన్ రాయల్స్ సెప్టెంబర్ 22న అమీతుమీ తేల్చుకోనుంది.