ETV Bharat / sports

'అలా అయితే ఐపీఎల్ కచ్చితంగా జరుగుతుంది'

కరోనా ప్రభావం తగ్గి పరిస్థితులు అక్టోబర్ వరకు సద్దుమణిగితే ఐపీఎల్ ఈ ఏడాది కచ్చితంగా జరుగుతుందన్నాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా. అప్పటివరకు వేచి చూడాలని తెలిపాడు.

నెహ్రా
నెహ్రా
author img

By

Published : Apr 8, 2020, 12:55 PM IST

కరోనా కారణంగా ఐపీఎల్ ఏప్రిల్ 15కు వాయిదా పడింది. కానీ అప్పుడూ ప్రారంభమయ్యే సూచనలు కనిపించట్లేదు. తాజాగా దీనిపై స్పందించాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా. లీగ్ అక్టోబర్​లో జరిగే అవకాశం ఉందని తెలిపాడు.

"ఐపీఎల్ ఆగస్టులో కూడా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఆ సమయంలో చాలా రాష్ట్రాల్లో వర్షం అడ్డంకిగా మారుతుంది. అందువల్ల ఎక్కువ మ్యాచ్​లు తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది. ఒకవేళ పరిస్థితులు అక్టోబర్​లోపు సద్దుమణిగితే ఐపీఎల్ ఈ ఏడాది కచ్చితంగా జరుగుతుంది."

-నెహ్రా, టీమ్​ఇండియా క్రికెటర్

కరోనా ప్రభావం కారణంగా మార్చి 29న జరగాల్సిన ఐపీఎల్ ఏప్రిల్ 15కు వాయిదా పడింది. అయితే ఈ తేదీనా జరిగే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే దేశంలో లాక్​డౌన్ ఏప్రిల్​ 14తో ముగుస్తుంది. కానీ లాక్​డౌన్​ను పొడిగించే యోచనలో కేంద్రప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా స్పష్టత లేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.