ETV Bharat / sports

ఐపీఎల్​ ఉత్సవానికి ఆల్​స్టార్స్​ మ్యాచ్​తో ముగింపు - IPL All Stars match 2020

భారత క్రికెట్​లో నూతన అధ్యాయం ఐపీఎల్​. వినూత్న ఆలోచనతో పొట్టి ఫార్మాట్ రూపంలో తీసుకొచ్చిన ఈ టోర్నీ.. సూపర్​ హిట్టుగా నిలిచింది. అలాంటి ఈ లీగ్​ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. టోర్నీలో 'ఆల్​ స్టార్​' మ్యాచ్​ను పెట్టాలని ప్రణాళిక రచించారు. అయితే తొలుత లీగ్​ ఆరంభంలో పెట్టాలనుకోగా.. తాజాగా దాన్ని ముగింపు మ్యాచ్​గా మార్చుతున్నట్లు స్పష్టం చేశారు.

IPL All Stars match
ఐపీఎల్​ పండుగ ఆల్​స్టార్స్​ మ్యాచ్​తో ముగింపు!
author img

By

Published : Feb 21, 2020, 8:29 AM IST

Updated : Mar 2, 2020, 1:00 AM IST

ఐపీఎల్​ నిర్వాహకులు మరో సరికొత్త మ్యాచ్​కు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో టీమిండియా స్టార్​ ప్లేయర్లు ధోనీ, కోహ్లీ, రోహిత్​ ఒకే జట్టులో కనువిందు చేయనున్నారు. ఈ ఆల్​ స్టార్​ మ్యాచ్​ తొలి సీజన్​ ఈ ఏడాది నుంచే ప్రారంభమవుతుందని తెలుస్తోంది. తొలుత ఈ మ్యాచ్​ను లీగ్​ ఆరంభంలో నిర్వహించాలని అనుకున్నారు. అయితే ఫ్రాంచైజీలతో చర్చించాక టోర్నీ ముగింపు కార్యక్రమంగా మార్చారు. ఇటీవల కాలంలో ఈ మ్యాచ్​ను కచ్చితంగా రద్దు చేస్తారని వార్తలు వచ్చాయి. వాటన్నింటికి తెరదించుతూ తాజా కబురు వినిపించారు లీగ్​ నిర్వాహకులు. ఏయే ఆటగాళ్లు రాణిస్తారో చూసి సీజన్‌ చివర్లో ఆల్‌స్టార్స్‌ మ్యాచ్‌ నిర్వహిస్తామని ఐపీఎల్‌ పాలక మండలి ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ స్పష్టం చేశారు.

" ఆల్‌స్టార్స్‌ మ్యాచ్‌ను మేం రద్దు చేయడం లేదు. టోర్నీ చివరకు వాయిదా వేస్తున్నాం. ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారో మేం చూడాలనుకుంటున్నాం. ఫామ్‌ ఆధారంగా జట్లను ఎంపిక చేస్తాం" అని బ్రిజేస్‌ పటేల్‌ తెలిపారు.

నాలుగేసి జట్లుగా...

ప్రస్తుతం ఐపీఎల్​లో ఎనిమిది జట్లు ఉన్నాయి. వాటిలో ఉత్తర, తూర్పు రాష్ట్రాలు ఒకవైపు, దక్షిణ, పడమర రాష్ట్రాల జట్లు మరో వైపు కలిసి ఆడనున్నాయి. ఫలితంగా కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​, దిల్లీ క్యాపిటల్స్​, రాజస్థాన్​ రాయల్స్​, కోల్​కతా నైట్​రైడర్స్​ ఒక బృందంగా ఏర్పడనున్నాయి. చెన్నై సూపర్​కింగ్స్​, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, సన్​రైజర్స్​ హైదరాబాద్​, ముంబయి ఇండియన్స్​ ప్రత్యర్థి జట్టుగా ఉండనున్నాయి. ఇదే జరిగితే కోహ్లీ, ధోనీ, రోహిత్​ ఒకే జట్టులో టీమిండియా జెర్సీ లేకుండా ఆడనున్నారు. ఇంకా తేదీలు, వేదిక ఖరారు కావాల్సి ఉంది.

ఐపీఎల్‌-2020 ఆరంభ మ్యాచ్‌ వచ్చే నెల 29న వాంఖడే వేదికగా జరగనుంది. తొలి మ్యాచ్​లో డిఫెండింగ్‌ ఛాంపియన్​ ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్‌ దశ 50 రోజులుపాటు జరిగి మే 17న ముగుస్తుంది. ఆ తర్వాత నాకౌట్‌ మ్యాచ్‌లు, మే 24న ఫైనల్‌ జరగనుంది.

Last Updated : Mar 2, 2020, 1:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.