ETV Bharat / sports

భారత్-ఆస్ట్రేలియా వన్డే​లో 'లవ్ ప్రపోజల్' - క్రికెట్ లైవ్

మ్యాచ్​ కోసం స్టేడియానికి హాజరైన ఆసీస్ మహిళా అభిమానికి, భారత అభిమాని లవ్ ప్రపోజ్ చేశాడు. దీనికి ఆమె కూడా ఒప్పుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.

indian supporter proposed an australian supporter in IND VS AUS SECOND ODI
భారత్-ఆస్ట్రేలియా వన్డే​లో 'లవ్ ప్రపోజల్'
author img

By

Published : Nov 29, 2020, 3:46 PM IST

భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డేలో ఆసక్తికర సంఘటన జరిగింది. స్టేడియానికి హాజరైన టీమ్​ఇండియా అభిమాని ఒకరు.. ఆసీస్ మహిళా అభిమానికి ప్రేమ ప్రతిపాదన చేశాడు. అందుకు ఆమె సిగ్గు పడుతూ ఒప్పుకుంది. దీంతో వారిద్దరూ హగ్​ చేసుకుని ముద్దు పెట్టుకున్నారు. అదే సమయంలో మ్యాచ్​ ఆడుతున్న మ్యాక్స్​వెల్​.. నవ్వుతూ, చప్పట్లు కొడుతూ వారిని ఉత్సాహపరిచాడు.

సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 389 పరుగుల భారీ స్కోరు చేసింది. ఐదుగురు బ్యాట్స్​మెన్ అర్ధసెంచరీలు చేయడం విశేషం. వీరిలో స్మిత్(104), వార్నర్(83), ఫించ్(60), లబుషేన్(70), మ్యాక్స్​వెల్(63) ఉన్నారు.

ఇది చదవండి: దంచికొట్టిన ఆస్ట్రేలియా.. టీమ్​ఇండియా లక్ష్యం 390

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.