బంగ్లాదేశ్‌పై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. తొలి టీ20లో ఓటమికి సమాధానంగా 8 వికెట్ల తేడాతో గెలుపొంది భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. రోహిత్ శర్మ విధ్వంసం సృష్టించడం వల్ల రాజ్‌కోట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిని చిత్తు చేసింది టీమిండియా.
వందో మ్యాచ్‌లో సెంచరీ మిస్
ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో 85 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ప్రత్యర్థి నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు. మిగిలిన వారిలో ధావన్ 31, శ్రేయాస్ అయ్యార్ 24, రాహుల్ 8 పరుగులు చేశారు.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. 20 ఓవర్లలో 153 పరుగులు చేసింది. వికెట్లు పడుతుండటం వల్ల బ్యాట్స్‌మెన్ ధాటిగా ఆడలేకపోయారు. మహ్మద్ నయీమ్ (36)దే అత్యధిక స్కోరు.
భారత్ బౌలర్లలో చాహల్ 2, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్ తలో వికెట్ తీశారు.
ఇది చదవండి: పొట్టి ఫార్మాట్లో రోహిత్ శర్మ 'సెంచరీ'