ETV Bharat / sports

ఇంగ్లాండ్ పర్యటనకు మహిళా టీమ్​ఇండియా దూరం!​ - 2021 మహిళా ప్రపంచకప్​

ఇంగ్లాండ్​ పర్యటనకు దూరంగా ఉండాలని భారత మహిళా క్రికెట్​ జట్టు యోచిస్తోంది. జూన్​లో ఇరుజట్ల మధ్య ఈ ద్వైపాక్షిక సిరీస్​ జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా సెప్టెంబర్​కు వాయిదా వేశారు.

India women's team likely to pull out of England tour
ఇంగ్లాండ్ పర్యటనకు భారత మహిళా జట్టు దూరం!​
author img

By

Published : Jul 21, 2020, 12:53 PM IST

కరోనా మహమ్మారి కారణంగా ఇంగ్లాండ్​ పర్యటనను రద్దు చేసుకునే ఆలోచనలో ఉంది భారత మహిళా క్రికెట్​ జట్టు. జూన్​లోనే ఇంగ్లీష్​ గడ్డపై పర్యటనకు మహిళా టీమ్ఇండియా వెళ్లాల్సింది. కానీ, కరోనా కారణంగా ఆ షెడ్యూల్​ను సెప్టెంబర్​కు వాయిదా వేశారు.

ద్వైపాక్షిక సిరీస్​​ కోసం యోచన!

సెప్టెంబర్​లో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్​, భారత్​.. ట్రైసిరీస్​ను నిర్వహించాలని ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు భావించింది. అయితే భారత జట్టు పర్యటనను రద్దు చేసుకుంటే.. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్​ ఉమెన్​ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్​ నిర్వహించనున్నారు. తొలుత రెండు టీ20లు, నాలుగు వన్డేలు ఆడించాలని నిర్ణయించినా.. ఈ సీజన్లో సాధ్యమైనంత ఎక్కువ మ్యాచ్​లను జరపడానికి ప్రణాళికను రచిస్తున్నారు. ఈ సిరీస్​లోని మ్యాచ్​లను డెర్బీ వేదికగా నిర్వహించే అవకాశం ఉంది.

ప్రపంచకప్​నకు సన్నద్ధం

వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో న్యూజిలాండ్​ వేదికగా ఐసీసీ ఉమెన్స్​ వన్డే ప్రపంచకప్​ జరగనుంది. దీంతో ద్వైపాక్షిక సిరీస్​లను నిర్వహించి తగిన ప్రాక్టీస్​తో వరల్డ్​కప్​కు సన్నద్ధమయ్యే విధంగా.. ఆయా దేశాల క్రికెట్​ బోర్డులు మ్యాచ్​లను షెడ్యూల్​ చేస్తున్నారు.

ఇంగ్లాండ్​ క్రికెటర్లకు శిక్షణ ప్రారంభం

ఇంగ్లాండ్​కు చెందిన మహిళా క్రికెటర్లు ఆ దేశంలోని ఆరు వేర్వేరు వేదికల్లో ఇప్పటికే శిక్షణ పొందుతున్నారు. మహిళా క్రికెటర్ల పట్ల ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు నిబద్ధతతో ఉంది. దాని ప్రకారం గత నెలలో బోర్డులోని 20 మంది దేశీయ క్రీడాకారిణిలకు కాంట్రాక్టులను ప్రకటించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.