వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్లు రోహిత్‌శర్మ, కేఎల్ రాహుల్ శతకాలతో చెలరేగారు. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో దూకుడు ప్రదర్శించారు. రోహిత్ వన్డేల్లో 28వ శతకం నమోదు చేసుకోగా.. రాహులో మూడో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 227 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు.
రోహిత్ @ 28...
విశాఖ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో 107 బంతుల్లో శతకం సాధించాడు రోహిత్. ఫలితంగా కెరీర్లో 28వ వన్డే సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. వీటితో పాటు ఈ ఏడాది.. వన్డేల్లో అత్యధిక పరుగుల వీరుడిగానూ ఘనత సాధించాడు.
-
💯
— BCCI (@BCCI) December 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Hitman gets to this 28th ODI Century. His 7th ODI ton of 2019. Top Man 🙌🙌#INDvWI pic.twitter.com/vxJkExGywF
">💯
— BCCI (@BCCI) December 18, 2019
Hitman gets to this 28th ODI Century. His 7th ODI ton of 2019. Top Man 🙌🙌#INDvWI pic.twitter.com/vxJkExGywF💯
— BCCI (@BCCI) December 18, 2019
Hitman gets to this 28th ODI Century. His 7th ODI ton of 2019. Top Man 🙌🙌#INDvWI pic.twitter.com/vxJkExGywF
- వన్డేల్లో ఒక ఏడాది కాలంలో ఎక్కువ శతకాలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ నాలుగో స్థానంలో నిలిచాడు. 9 శతకాలు-సచిన్ తెందూల్కర్ (1998), 7 శతకాలు- సౌరభ్ గంగూలీ (2000), 7 శతకాలు- డేవిడ్ వార్నర్ (2016), 7*శతకాలు- రోహిత్ శర్మ (2019) వరుసగా ఈ జాబితాలో ఉన్నారు.
- ఈ మ్యాచ్‌లో మరో రికార్డును అందుకున్నాడు హిట్‌మ్యాన్. ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. తాజా సెంచరీ సాధించేసరికి ఈ ఏడాదిలో 75 సిక్సర్లు బాదాడు. 2018లో 74 సిక్సర్లు, 2017లో 65 సిక్సర్లతో హ్యాట్రిక్ రికార్డు కొట్టాడు.
- అన్ని పార్మాట్లలో కలిపి రోహిత్ ఈ ఏడాది 10 శతకాలు చేశాడు. ఒక ఓపెనర్ ఇన్ని సెంచరీలు చేయడం రికార్డు. గతంలో సచిన్-(9), గ్రేమ్ స్మిత్(9), వార్నర్(9) మాత్రమే సాధించారు.
- ఈ ఏడాది ఎక్కువ శతకాలు సాధించిన బ్యాట్స్‌మెన్‌లో రోహిత్(10) టాప్‌లో ఉన్నాడు. తర్వాతి స్థానంలో కోహ్లీ(7), వార్నర్(6) ఉన్నారు.
రాహుల్ @ 3...
కేఎల్ రాహుల్ వన్డేల్లో మూడో సెంచరీ చేశాడు. 102 బంతుల్లో 100 రన్స్(8 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు.
-
Here it is 💯
— BCCI (@BCCI) December 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
A fantastic innings as @klrahul11 brings up his 3rd ODI ton 👏👏#INDvWI pic.twitter.com/z4TiKocgeC
">Here it is 💯
— BCCI (@BCCI) December 18, 2019
A fantastic innings as @klrahul11 brings up his 3rd ODI ton 👏👏#INDvWI pic.twitter.com/z4TiKocgeCHere it is 💯
— BCCI (@BCCI) December 18, 2019
A fantastic innings as @klrahul11 brings up his 3rd ODI ton 👏👏#INDvWI pic.twitter.com/z4TiKocgeC
ఈ ద్వయం నాలుగోసారి..
వన్డేల్లో రోహిత్ శర్మ-రాహుల్ 130+ పరుగులకు పైగా ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని సాధించడం ఇది నాలుగోసారి. ఈ మ్యాచ్‌కు ముందు మాంచెస్టర్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ 136 పరుగులు నమోదు చేయగా, బంగ్లాదేశ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో 180 రన్స్ సాధించిందీ జోడీ. శ్రీలంకతో లీడ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఈ జోడి 189 ఓపెనింగ్ పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది రోహిత్-రాహుల్ ద్వయం. తాజా మ్యాచ్‌లో తొలి వికెట్‌కు 227 రికార్డు భాగస్వామ్యం సాధించారు.