మొతేరా వేదికగా జరుగుతోన్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ప్రత్యర్థి జట్టు 75.5 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టీమ్‌ఇండియా స్పిన్నర్లు అక్షర్ పటేల్ (4), రవిచంద్రన్ అశ్విన్ (3) ఇంగ్లీష్ జట్టుపై మరోసారి ఆధిపత్యాన్ని కొనసాగించారు. తమదైన వైవిధ్యం ప్రదర్శిస్తూ చక్కని స్పిన్‌తో వణికించారు.
వారికి తోడుగా మహ్మద్ సిరాజ్ (2) కీలకమైన వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ జట్టులో బెన్‌స్టోక్స్ (55), డేనియెల్ లారెన్స్ (46) టాప్ స్కోరర్లు. జోరూట్ (5) మరోసారి విఫలమయ్యాడు.
ఇదీ చూడండి: టీ విరామానికి ఇంగ్లాండ్ 144/5.. స్టోక్స్ అర్ధసెంచరీ