ETV Bharat / sports

టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న బంగ్లాదేశ్​

దిల్లీ వేదికగా భారత్​తో తలపడుతున్న తొలి టీ20లో టాస్​ గెలిచి బౌలింగ్​​ ఎంచుకుంది బంగ్లా జట్టు. రోహిత్​ సారథ్యంలోని టీమిండియా మొదట బ్యాటింగ్​కు దిగింది.

author img

By

Published : Nov 3, 2019, 6:45 PM IST

Updated : Nov 3, 2019, 7:08 PM IST

టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న బంగ్లా

దిల్లీలోని అరుణ్​జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్న తొలి టీ20లో బంగ్లా జట్టు బౌలింగ్​ ఎంచుకుంది. టాస్​ గెలిచిన బంగ్లాదేశ్​ కెప్టెన్​ మహ్మదుల్లా... టీమిండియాను బ్యాటింగ్​కు ఆహ్వానించాడు. రోహిత్​ సారథ్యంలోని భారత జట్టు తొలుత బ్యాటింగ్​కు దిగింది. ఇది టీ20 చరిత్రలో 1000వ మ్యాచ్​ కావడం విశేెషం.

దూబేకు అవకాశం...

తొలి టీ20లో టీమిండియా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు ముంబయి ఆటగాడు దూబే. ఈ మ్యాచ్​ ద్వారా తొలిసారి అంతర్జాతీయ టీ20లో అరంగేట్రం చేస్తున్నాడీ యువ క్రికెటర్​. పంత్​కు కీపర్​గా అవకాశమివ్వగా... కేరళ స్టార్​ క్రికెటర్​ సంజూ శాంసన్​కు నిరాశ ఎదురైంది.

బంగ్లాదేశ్​ ఆటగాడు మహ్మద్​ నయీమ్​... ఇదే మ్యాచ్​ ద్వారా అంతర్జాతీయ టీ20లకు అరంగేట్రం చేస్తున్నాడు.

రికార్డు విజయాలు...

ఇప్పటివరకు బంగ్లాపై ఆడిన 8 టీ20 మ్యాచ్​ల్లో అన్నింటా గెలుపొందింది భారత జట్టు. ఈ మ్యాచ్​లోనూ విజయం సాధించి సిరీస్‌లో బోణీ కొట్టాలని చూస్తోంది టీమిండియా.

పాకిస్థాన్​ 11-0 తేడాతో జింబాబ్వేపై అత్యధిక వరుస విజయాలు సాధించిన జట్టుగా తొలిస్థానంలో కొనసాగుతోంది. బంగ్లాపై ఎనిమిది విజయాలతో రెండో స్థానంలో నిలిచింది భారత్​. అయితే టీమిండియా వరుస విజయాలకు చెక్‌ పెట్టాలని బంగ్లా కూడా పట్టుదలగా ఉంది.

బంగ్లాదేశ్​ సీనియర్‌ క్రికెటర్లు షకిబ్‌ అల్‌ హసన్‌ రెండేళ్ల పాటు ఆటకు దూరం కాగా, తమీమ్‌ ఇక్బాల్‌ ఈ సిరీస్‌లో ఆడటం లేదు. ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు లేకపోయినా మంచి పట్టుదలతో కనిపిస్తుంది పసికూన జట్టు.

స్టేడియం మరింత ప్రత్యేకం..

  • అరుణ్‌ జైట్లీ (ఫిరోజ్‌షా కోట్లా) స్టేడియంలో భారత్‌ ఒకే ఒక్క టీ20 ఆడింది. 2017 నవంబరు 1న న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 53 పరుగుల తేడాతో విజయం సాధించింది.
  • ఈ వేదికలో జరిగిన టీ20ల్లో తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 157. రెండో ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 143.
  • ఈ స్టేడియంలో 202 అత్యధిక స్కోరు. 2017లో న్యూజిలాండ్‌పై భారత్‌ సాధించింది.
  • బంగ్లాదేశ్‌-భారత్‌ మధ్య 8 టీ20లు జరిగాయి. అన్నింట్లోనూ టీమిండియాదే విజయం. అయితే రెండు జట్లూ ఇప్పటిదాకా ద్వైపాక్షిక సిరీస్‌లో ఒక్కసారీ తలపడలేదు. ఈరోజే తొలి మ్యాచ్‌ ఆడనున్నాయి.

బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఎన్నికయ్యాక టీమిండియా ఆడుతున్న తొలి మ్యాచ్​ ఇదే. చివరి వరకు మ్యాచ్​ రద్దు చేయకుండా అద్భుతంగా మ్యాచ్​ నిర్వహించడంలో సఫలమయ్యాడు దాదా.

ఇరు జట్లు

భారత జట్టు..

రోహిత్​శర్మ(కెప్టెన్​), శిఖర్​ ధావన్​, కేఎల్​ రాహుల్​, శ్రేయస్​ అయ్యర్​, రిషభ్ పంత్​(కీపర్​), వాషింగ్టన్​ సుందర్​, కృనాల్​ పాండ్య, యుజువేంద్ర చాహల్​, దీపక్​ చాహర్​, ఖలీల్​ అహ్మద్​, శివమ్​ దూబే​, శార్దుల్​ ఠాకుర్​

బంగ్లా జట్టు..

మహ్మదుల్లా(కెప్టెన్​), సౌమ్య సర్కార్​, మహ్మద్​ నయీమ్​, ఆఫిఫ్​ హొస్సేన్​, మొసదెక్​ హొస్సేన్​, అమినుల్​ ఇస్లాం, లిటన్​ దాస్​ ముష్ఫికర్​ రహీమ్​, అరాఫత్​ సన్నీ, అల్​అమిన్​ హొస్సేన్​, ముష్ఫికర్​ రహ్మాన్​, షైఫుల్​ ఇస్లాం

AP Video Delivery Log - 1200 GMT ENTERTAINMENT
Sunday, 3 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1116: Mexico Day of the Dead AP Clients Only 4237971
Mexico City caps off Day of the Dead celebrations
AP-APTN-1116: Argentina Pride AP Clients Only 4237970
Thousands march in Buenos Aires for Gay Pride Parade
AP-APTN-1715: US PEN Gala AP Clients Only 4237921
Ava DuVernay among winners advocating free speech at PEN gala
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 3, 2019, 7:08 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.