టీమ్ఇండియా పేసర్ ఉమేశ్ యాదవ్ ఆసీస్‌తో జరిగే మూడు, నాలుగు టెస్టులకు అందుబాటులో ఉండట్లేదు. రెండో టెస్టు, మూడో రోజు ఆటలో గాయం కావడమే ఇందుకు కారణం. బెంగళూరు ఎన్సీఏ శిక్షణ శిబిరంలో చికిత్స తీసుకునేందుకు బుధవారం రాత్రి అతడు స్వదేశానికి తిరిగి బయలుదేరాడని తెలిసింది. ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరగబోయే సిరీస్ వరకు అతడు కోలుకుంటాడని సమాచారం.
ఇప్పటికే గాయాల కారణంగా మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ సేవలను కోల్పోయింది టీమ్ఇండియా. దీంతో ప్రస్తుతం బుమ్రా, సిరాజ్‌లతో బంతిని పంచుకునే పేసర్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
శార్దూల్‌కే ఓటు..
ఉమేశ్ గాయంతో ఆసీస్ సిరీస్ నుంచి వైదొలగగా అతడి స్థానంలో మూడో టెస్టు కోసం శార్దూల్ ఠాకూర్‌ను తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. నటరాజన్‌ను తీసుకుంటారని వార్తలు వచ్చినా మేనేజ్మెంట్ శార్దూల్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి : మూడో టెస్టుకు ఉమేశ్ స్థానంలో నటరాజన్!