రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. తొలిరోజు లంచ్ విరామ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్(10), పుజారా(0), కెప్టెన్ విరాట్ కోహ్లీ(12) విఫలమయ్యారు. ప్రస్తుతం క్రీజులో రోహిత్, రహానే ఉన్నారు.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేన.. జట్టులో స్వల్పమార్పులతో బరిలోకి దిగింది. ఇషాంత్ శర్మను పక్కనపెట్టి షాబాజ్ నదీమ్‌కు చోటు కల్పించింది.