దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో నామమాత్రపు స్కోరుకే పరిమితమయ్యారు. ముఖ్యంగా బంగ్లా బౌలర్లు.. భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో విజయం సాధించారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ దివ్వాంశ్ సక్సేనా (2) తొందరగానే పెవిలియన్ చేరాడు. ఈ టోర్నీలో అద్భుత ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్ మరోసారి సత్తాచాటాడు. బంగ్లా బౌలర్లను సమర్థవంతగా ఎదుర్కొన్నాడు. తిలక్ వర్మతో కలిసి రెండో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో తిలక్ 38 పరుగులు చేసి ఔటయ్యాడు. కాసేపటికే కెప్టెన్ ప్రియమ్ గార్గ్ (7) పెవిలియన్ చేరి నిరాశపర్చాడు. అర్ధశతకం చేసి జోరు మీదున్న యశస్వి జైస్వాల్ (88) షరిఫుల్ ఇస్లామ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. వెంటనే భారత్ 21 పరుగుల తేడాలో 7 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్‌ను ముగించింది.
-
#TeamIndia all out for 177.
— BCCI (@BCCI) February 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
The Bangladesh chase shall begin shortly.
Follow the #INDvBAN #U19CWC final live 👇👇https://t.co/WK6GcTF6Ou pic.twitter.com/QPCaRERUEJ
">#TeamIndia all out for 177.
— BCCI (@BCCI) February 9, 2020
The Bangladesh chase shall begin shortly.
Follow the #INDvBAN #U19CWC final live 👇👇https://t.co/WK6GcTF6Ou pic.twitter.com/QPCaRERUEJ#TeamIndia all out for 177.
— BCCI (@BCCI) February 9, 2020
The Bangladesh chase shall begin shortly.
Follow the #INDvBAN #U19CWC final live 👇👇https://t.co/WK6GcTF6Ou pic.twitter.com/QPCaRERUEJ
బంగ్లా బౌలర్లలో బంగ్లా బౌలర్లలో అవిశేక్ దాస్ 3, షరిపుల్ ఇస్లామ్, తన్జీమ్ హసన్ రెండు, రకీబుల్ హసన్ ఒక వికెట్ దక్కించుకున్నారు.