అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టెస్టులో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో భారత్ జయభేరి మోగించింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు.. అశ్విన్, అక్షర్ చెరో 5 వికెట్లు తీసుకున్నారు.
మొత్తంగా ఈ టెస్టులో అక్షర్ 9, అశ్విన్ 8 వికెట్లు పడగొట్టారు.
160 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడను తలపించింది. భారత స్పిన్నర్ల ధాటికి ఏ ఒక్కరూ క్రీజులో నిలువలేకపోయారు. అర్ధ సెంచరీ చేసిన లారెన్స్ ఆ జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఈ విజయంతో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోకి ప్రవేశించింది. 72.2 విజయశాతంతో టీమ్ఇండియా అగ్రస్థానంలోకి వెళ్లింది. లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
-
That victory against England means India finish the league phase of the inaugural ICC World Test Championship with a fine view from the top of the table 🔝#INDvENG | #WTC21 pic.twitter.com/rXFiKPXdB7
— ICC (@ICC) March 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">That victory against England means India finish the league phase of the inaugural ICC World Test Championship with a fine view from the top of the table 🔝#INDvENG | #WTC21 pic.twitter.com/rXFiKPXdB7
— ICC (@ICC) March 6, 2021That victory against England means India finish the league phase of the inaugural ICC World Test Championship with a fine view from the top of the table 🔝#INDvENG | #WTC21 pic.twitter.com/rXFiKPXdB7
— ICC (@ICC) March 6, 2021
సంక్షిప్త స్కోర్లు:
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్- 205 ఆలౌట్( స్టోక్స్ 55, లారెన్స్ 46, అక్షర్ పటేల్ 4/68, అశ్విన్ 3/47)
భారత్ తొలి ఇన్నింగ్స్- 365 ఆలౌట్( పంత్ 101, వాషింగ్టన్ సుందర్ 96*, స్టోక్స్ 4/89, అండర్సన్ 3/44)
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్- 135 ఆలౌట్( లారెన్స్ 50, రూట్ 30, అశ్విన్ 5/47, అక్షర్ 5/48)
ఇదీ చదవండి:లంచ్ సమయానికి ఇంగ్లాండ్ 6/0- 154 పరుగుల వెనుకంజ