న్యూజిలాండ్‌పై జరిగిన నిరాశాజనకమైన టెస్టు సిరీస్ తర్వాత కూడా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 116 పాయింట్లతో మొదటి స్థానంలోనే కొనసాగుతోంది టీమిండియా. ప్రపంచటెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇదే మొదటి ఓటమి. ఈ సిరీస్ విజయం తర్వాత కివీస్ 110 పాయింట్లతో రెండో స్థానంలో, మూడవ స్థానంలో ఆస్ట్రేలియా నిలిచాయి. బ్యాట్స్‌మెన్ విభాగంలో విరాట్‌కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు.
మంగళవారం ఐసీసీ విడుదల చేసిన టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్ 911 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌కు చెందిన టామ్ బ్లండెల్, జేమిసన్, టీమిండియా బ్యాట్స్‌మన్ పృథ్వీషా స్థానాలను మెరుగుపర్చుకున్న వారిలో ముందున్నారు. భారత్‌పై సిరీస్ విజయాల తర్వాత 37వ స్థానంలో స్థిరపడ్డాడు బ్లండెల్. పృథ్వీషా 76ల ర్యాంకులో ఉన్నాడు.
మయాంక్ అగర్వాల్ 10వ ర్యాంకును ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఆక్రమించాడు. ఒక స్థానానికి దిగిపోయి 11 స్థానంలో స్థిరపడ్డాడు మయాంక్. బౌలర్లలో టిమ్ సౌథీ 4వ ర్యాంకులో, టీమిండియా బౌలర్ బుమ్రా 7వ స్థానంలో ఉన్నారు.
ఇదీ చూడండి.. రంజీ ట్రోఫీలో 13 ఏళ్లకు ఫైనల్ చేరిన బెంగాల్