ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మొదటి వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ సునాయస క్యాచ్‌లతో పెవిలియన్ చేరుతున్నారు. ఇప్పటికే ఓపెనర్ రోహిత్ శర్మ సులభమైన క్యాచ్ ఇచ్చి ఔటవగా.. వన్‌డౌన్‌లో వచ్చిన కేఎల్ రాహుల్ (47) స్టీవ్ స్మిత్‌కు ఇలాంటి క్యాచ్ ఇచ్చే పెవిలియన్ చేరాడు. తద్వారా మూడు పరుగుల తేడాతో అర్ధసెంచరీని మిస్సయ్యాడు.
ఓపెనర్ ధావన్ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. 66 బంతుల్లో 8 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. అనంతరం 74 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. మరో 16 పరుగులు చేశాక.. జట్టు స్కోరు 156 పరుగుల వద్ద కెప్టెన్ కోహ్లీ (16) ఆడమ్ జంపా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అనంతరం మరో 12 పరుగుల తేడాలో శ్రేయస్ అయ్యర్ (4) పెవిలియన్ చేరి టీమిండియా శిబిరంలో ఆందోళన నింపాడు. ఫలితంగా 30 పరుగుల తేడాలో నాలుగు కీలక వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది కోహ్లీసేన. ప్రస్తుతం పంత్, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు.
-
India have lost 4/30 after being 134/1. A superb fightback from Australia 💪#INDvAUS pic.twitter.com/mICrwa2CNm
— ICC (@ICC) January 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">India have lost 4/30 after being 134/1. A superb fightback from Australia 💪#INDvAUS pic.twitter.com/mICrwa2CNm
— ICC (@ICC) January 14, 2020India have lost 4/30 after being 134/1. A superb fightback from Australia 💪#INDvAUS pic.twitter.com/mICrwa2CNm
— ICC (@ICC) January 14, 2020
ఇవీ చూడండి.. దాదా, భజ్జీ స్టెప్పులు.. అభిమానులు ఫిదా