ప్రపంచ క్రికెట్లో సత్తాచాటి దిగ్గజాలుగా పేరుగాంచిన సచిన్ తెందూల్కర్, లారా, జాంటీ రోడ్స్‌తో పాటు పలువురు మాజీ క్రికెటర్లు మరోసారి మైదానంలో సందడి చేయనున్నారు. రోడ్డు భద్రతా అవగాహన (రోడ్ సేఫ్టీ అవేర్నెస్) కార్యక్రమంలో భాగంగా జరిగే టీ20 ఎగ్జిబిషన్ టోర్నీలో వీరు పాల్గొననున్నారు. ఈ టోర్నీలో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ దేశాలకు చెందిన దిగ్గజ ఆటగాళ్లు మరోసారి తమ ఆటతో ప్రేక్షకుల్ని మైమరిపించనున్నారు. తాజాగా ఇందులో పాల్గొనే జట్లను ప్రకటించారు. ఇండియా లెజెండ్స్‌కు సచిన్ సారథ్యం వహించనున్నాడు.
ఇండియా లెజెండ్స్
సచిన్ తెందూల్కర్ (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్, అజిత్ అగార్కర్, సంజయ్ బంగర్, మునాఫ్ పటేల్, మహ్మద్ కైఫ్, ప్రజ్ఞాన్ ఓజా, సైరాజ్ బహుతులే, సమీర్ దిఘే (వికెట్ కీపర్)
ఆస్ట్రేలియా లెజెండ్స్
బ్రెట్‌లీ (కెప్టెన్), బ్రాడ్ హాడ్జ్, బ్రెట్ గీవ్స్, క్లింట్ మెక్కే, జార్జ్ గ్రీన్, జాసన్ క్రేజా, మార్క్ కాస్గ్రోవ్, నాథన్ రీర్డన్, రాబ్ క్వినే, షేన్ లీ, ట్రెవిస్ బర్ట్, గ్జేవియర్ దోహర్టీ
వెస్టిండీస్ లెజెండ్స్
బ్రియన్ లారా (కెప్టెన్), రిడ్లే జాకబ్స్ (కీపర్), శివ్ నరేన్ చంద్రపాల్, రామ్ నరేశ్ శర్వాన్, ఆడం సాన్పోర్డ్, కార్ల్ హూపర్, డన్జా హ్యాట్, డారెన్ గంగా, పెడ్రో కొలిన్స్, రికార్డో పావెల్, సామ్యూల్ బద్రీ, సులేమాన్ బెన్, యోహన్ బ్లేక్
శ్రీలంక లెజెండ్స్
దిల్షాన్ (కెప్టెన్), దులంజన, చమెర కపుగేదర, వాస్, మహరూఫ్, ఆటపట్టు, మురళీధరన్, రంగనా హెరాత్, రమేష్ కలువితరన, సచిత్ర సేననాయకే, తిలాన్ తుషారా, తిలానా కందంబీ, ఉపుల్ చందన
దక్షిణాఫ్రికా లెజెండ్స్
జాంటీ రోడ్స్ (కెప్టెన్), ర్యాన్ మెక్లారెన్, ఆండ్రూ బచ్, ఆండ్రూ హాల్, గార్నెట్ క్రూగర్, రుడాల్ఫ్, అల్బీ మోర్కెల్, వాన్‌డర్ వాత్, నీల్ రోడ్స్, క్లుజెనర్, మార్టిన్ జార్స్‌వెల్డ్, మోర్నే నవిక్, పాల్ హారిస్
ఈ ఎగ్జిబిషన్ టోర్నీలో భాగంగా మొత్తం 11 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో వాంఖడేలో రెండు, ఎమ్సీఏ స్టేడియం పుణె, డీవై పాటిల్ స్టేడియంలో నాలుగు, చిరవగా ఫైనల్ బార్బోర్న్ స్టేడియంలో మార్చి 22న నిర్వహించనున్నారు. మొదటి మ్యాచ్ మార్చి 10న జరగనుంది. అన్ని మ్యాచ్‌లు సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయి.