అహ్మదాబాద్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ నాలుగో టీ20లో టాస్ గెలిచిన మోర్గాన్ సేన బౌలింగ్ ఎంచుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-2తో వెనుకబడ్డ టీమ్ఇండియా ఈ మ్యాచ్ గెలిచి ఎలాగైనా సమం చేయాలని చూస్తోంది.
ఈ మ్యాచ్ కోసం జట్టులో పలు మార్పులు చేసింది భారత్. యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ బదులు సూర్యకుమార్ యాదవ్‌కు చోటిచ్చారు. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ స్థానంలో రాహుల్ చాహర్‌కు అవకాశమిచ్చారు. ఇంగ్లాండ్ మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.
తుది జట్లు:
భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, శార్దుల్ ఠాకుర్, రాహుల్ చాహర్.
ఇంగ్లాండ్: జేసన్ రాయ్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, సామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
ఇదీ చూడండి: హాలీవుడ్ హీరోలుగా కోహ్లీ - కేన్