బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో తలపడిన మూడో టెస్టును భారత్ డ్రాగా ముగించింది. 407 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగింది టీమ్ఇండియా. 98/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించి.. మరో 3 వికెట్లు కోల్పోయి 131 ఓవర్లలో 334/5 స్కోర్ సాధించింది. దీంతో ఫలితం తేలుతుందని భావించిన సిడ్నీ టెస్టు డ్రాగా ముగిసింది.
భారత జట్టులో విహారి(23; 161 బంతుల్లో 4x4), అశ్విన్(39; 128 బంతుల్లో 7x4)కీలక ఇన్నింగ్స్ ఆడి నాటౌట్‌గా నిలిచారు. అంతకుముందు రెండో సెషన్‌లో పంత్(97; 118 బంతుల్లో 12x4, 3x6), పుజారా(77; 205 బంతుల్లో 12x4) ఔటయ్యాక జోడీ కట్టిన విహారి, అశ్విన్ మరో వికెట్ పడకుండా చివరివరకూ క్రీజులో నిలిచారు. ఈ నేపథ్యంలోనే 258 బంతుల్లో 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆఖరి సెషన్‌లో ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టి మ్యాచ్‌ను డ్రా చేశారు.