ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్‌ను టెస్టుల్లో పదోసారి ఔట్ చేశాడు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. భారత్, ఆసీస్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో అతడు ఈ ఘనత సాధించాడు. సిడ్నీ టెస్టు మూడో రోజున అశ్విన్ వేసిన 10వ ఓవర్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు వార్నర్. ఫలితంగా అశ్విన్ బౌలింగ్‌లో ఎక్కువ సార్లు ఔటైన బ్యాట్స్మెన్లలో అగ్రస్థానంలో నిలిచాడు.
టెస్టు ఫార్మాట్లో ఆ తర్వాత ఇంగ్లాండ్ క్రికెటర్లు అలిస్టర్ కుక్‌ను 9సార్లు, బెన్ స్టోక్స్‌ను 7 సార్లు పెవిలియన్‌కు పంపాడు అశ్విన్. ఇప్పటివరకు వార్నర్‌ను 12సార్లు ఔట్ చేసిన ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ మాత్రమే అశ్విన్ కన్నా ముందున్నాడు.
ఇదీ చూడండి: సిడ్నీ టెస్టు: విఫలమైన భారత్.. ఆధిక్యంలో ఆసీస్