ETV Bharat / sports

'ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉంది' - kapil's angioplasty therapy successful

తన ఆరోగ్యం నిలకడగానే ఉందని భారత మాజీ క్రికెటర్ కపిల్​దేవ్​ అన్నాడు. ఛాతినొప్పితో ఆసుపత్రిలో చేరిన కపిల్​కు యాంజియోప్లాస్టీ చికిత్స చేశారు వైద్యులు.

Kapil Dev_Tweet
ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉంది: కపిల్​దేవ్
author img

By

Published : Oct 24, 2020, 12:27 AM IST

Updated : Oct 24, 2020, 11:50 AM IST

ఛాతినొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరిన టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ కపిల్​దేవ్​​.. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయనే స్వయంగా ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు. శుక్రవారం ఉదయం ఆసుపత్రిలో చేరిన కపిల్​కు యాంజియోప్లాస్టీ చికిత్స విజయవంతంగా చేశారు వైద్యులు.

Kapil Dev_Tweet
కపిల్​దేవ్

" నా శ్రేయస్సు కోరిన అభిమానుల ఆదరాభిమానాలకు పేరుపేరునా ధన్యవాదాలు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉంది. రికవరీ అవుతున్నా".

-కపిల్​దేవ్, భారత మాజీ క్రికెటర్​

అనారోగ్యంతో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్​దేవ్ దిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు యాంజియోప్లాస్టీ చికిత్స చేశామని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు పేర్కొన్నాయి.

ఇదీ చదవండి:దిగ్గజ క్రికెటర్​ కపిల్​దేవ్​కు గుండెపోటు!

Last Updated : Oct 24, 2020, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.