ETV Bharat / sports

WC 19: ప్రపంచకప్​ వేదికలు... వాటి సామర్థ్యాలు - cordiff

క్రికెట్​ మహాసంగ్రామం మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. ఈ టోర్నీ కోసం ఇంగ్లండ్​ వ్యాప్తంగా 11 మైదానాలను సిద్ధం చేశారు నిర్వాహకులు. ఇప్పటికే ఈ మైదానాల్లో రెండేసి సన్నాహాక మ్యాచ్​లు జరిగాయి. ఆ మైదానాల సామర్థ్యం, ప్రత్యేకతలపై ఓ లుక్కేద్దాం.

WC19: ప్రపంచకప్​ వేదికలు... దాని సామర్థ్యాలు
author img

By

Published : May 29, 2019, 10:20 PM IST

Updated : May 30, 2019, 9:19 AM IST

ఐసీసీ 12వ ప్రపంచకప్ టోర్నీ రేపటి​​ (గురువారం) నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రికెట్​ సంగ్రామానికి ఇంగ్లండ్, వేల్స్​లోని 11 మైదానాలు అతిథ్యమివ్వనున్నాయి. 11 మైదానాల్లో 48 మ్యాచ్​లు జరగనున్నాయి. జులై 14న ఫైనల్​ మ్యాచ్​ చారిత్రక లార్డ్స్​ మైదానంలో జరగనుంది. మరి ఇంత గ్రాండ్​ టోర్నీకి ఆతిథ్యమిస్తోన్న మైదానాల విశేషాలపై ఓ లుక్కేయండి.

లార్డ్స్, లండన్​

205 ఏళ్ల చరిత్ర ఉన్న అత్యంత ప్రాచీన మైదానంగా... క్రికెట్​ మక్కాగా గుర్తింపు పొందిన స్టేడియం లార్డ్స్​. ఇక్కడ 1884లోనే ఓ టెస్టు మ్యాచ్‌ను నిర్వహించారు. 1972 నుంచి వన్డే మ్యాచ్​లకు ఆతిథ్యమిస్తోందీ స్టేడియం.

1983లో భారత కెప్టెన్​ కపిల్​దేవ్​ వరల్డ్‌కప్‌ను ముద్దాడింది లార్డ్స్​లోనే. నాట్‌వెస్ట్ సిరీస్ విజయ సంబరాల్లో సౌరభ్ గంగూలీ చొక్కావిప్పి సింహనాదం చేసిందీ ఇక్కడే. ఇంగ్లండ్‌లో ఇప్పటి వరకు నాలుగు వరల్డ్‌కప్‌లు జరిగితే ఆ నాలుగుసార్లు ఫైనల్ వేదిక ఇదే. ఈసారి ఫైనల్ సహా మొత్తం ఐదు మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది లార్డ్స్​. అయితే లీగ్ దశలో భారత్ ఆడే ఒక్క మ్యాచ్ కూడా ఇక్కడ జరగకపోవడం మన అభిమానులను నిరాశ పరిచే అంశమే. విరాట్ సేన ఫైనల్ చేరితే లార్డ్స్‌లో భారత్​ ఆటను మ్యాచ్ చూసే అవకాశం వస్తుంది.

lords
ది లార్డ్స్, లండన్

ప్రత్యేకతలు : దక్షిణ.. పడమరల్లో 8 అడుగుల 2 అంగులాలు ఎక్కువగా గ్రౌండ్​ విస్తరించి ఉంటుంది.
సామర్థ్యం: 28వేలు
నిర్వహణ: ఫైనల్​తో కలిపి 5 మ్యాచ్​లు

ఎడ్జ్‌బాస్టన్​, బర్మింగ్‌హామ్

2013లో ఐసీసీ ఛాంపియన్స్​ ట్రోపీ ఫైనల్​కు ఆతిథ్యమిచ్చింది ఎడ్జ్​బాస్టన్​ స్టేడియం. 1882లో నిర్మించిన ఈ స్టేడియంలో 1902లో తొలి టెస్టు మ్యాచ్​, 1972లో తొలి వన్డే జరిగింది. 1999 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల మధ్య టైగా ముగిసిన మ్యాచ్ జరిగింది ఇక్కడే. ఈ మైదానంలో భారత రికార్డు అద్భుతంగా ఉంది. మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఏడు గెలిచి, మూడు మ్యాచ్​లు ఓడింది. జూన్​ 30న ఇంగ్లండ్​తో, జులై 2న బంగ్లాదేశ్​తో భారత్​ తలపడేది ఇక్కడే.

edbaston
ఎడ్​బాస్టన్, బర్మింగ్​హమ్

సామర్థ్యం: 25వేలు
నిర్వహణ: సెమీఫైనల్​ సహా 5 మ్యాచ్​లు

బ్రిస్టల్ - కంట్రీ గ్రౌండ్​
1983 నుంచి ఈ మైదానంలో అంతర్జాతీయ మ్యాచ్​లు జరుగుతున్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు టెస్టు మ్యాచ్​ జరగలేదు. ఈ సారి మూడు వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్న బ్రిస్టల్ మైదానం... సామర్థ్యం పరంగా చిన్నది. ఈ వేదికపైనే అత్యధిక పరుగులు చేశాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్​.

bristal country ground
బ్రిస్టల్ కంట్రీ గ్రౌండ్​

సామర్థ్యం: 17వేల 500
నిర్వహణ: 3 మ్యాచ్​లు

సోఫియా గార్డెన్స్​, కార్డిఫ్

వేల్స్​లోని సోఫియా గార్డెన్స్ క్రికెట్ మైదానం ఈసారి 4 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది. ప్రస్తుత ప్రపంచకప్​నకు ఆతిథ్యమిస్తోన్న స్టేడియాల్లో రెండో చిన్నది ఇది. దీన్నే స్వాలెక్​ స్టేడియం అంటారు. 1999 వరల్డ్‌కప్ తర్వాత ఇక్కడ ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగలేదు. చివరిసారిగా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‌కు వేదికైంది సోఫియా గార్డెన్స్​.

cardiff
కార్డిఫ్ మైదానం

సామర్థ్యం: 15వేల 200
నిర్వహణ: 4 మ్యాచ్​లు

రివర్​ సైడ్​ గ్రౌండ్​, చెస్టర్లీ స్ట్రీట్

మూడు మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్న చెస్టర్లీ స్ట్రీట్ మైదానం పేస్‌తో పాటు స్వింగ్‌కు అనుకూలించనుంది. 1995లో దీన్ని నిర్మించారు. 1999 వరల్డ్‌కప్ నుంచి అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తున్న ఈ మైదానంలో ఇప్పటివరకు మొత్తం 16 మ్యాచ్‌లే జరిగాయి.

river side ground
రివర్ సైడ్ గ్రౌండ్

సామర్థ్యం: 19 వేలు
నిర్వహణ: 3 మ్యాచ్‌లు

లీడ్స్, హెడింగ్లే

లార్డ్స్ తర్వాత పురాతన మైదానంగా గుర్తింపు ఉన్న లీడ్స్ హెడింగ్లే స్టేడియం ఇప్పటి వరకు 12 ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది. ప్రస్తుతం దీన్ని ఎమరాల్డ్​ హెడింగ్లే క్రికెట్​ స్టేడియంగా పిలుస్తున్నారు. వాతావరణం మేఘావృతమై ఉంటే ఈ పిచ్​ పేసర్లకు చక్కటి సహకారం ఇస్తుంది. ఈ మైదానంలోనే క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ రెండు ట్రిపుల్ సెంచరీలు చేశారు.

leeds
లీడ్స్, హెడ్డింగ్లీ

సామర్థ్యం: 18వేల 350
నిర్వహణ: 4 మ్యాచ్‌లు( జూలై 6న భారత్ X శ్రీలంక )

ఓవల్​, లండన్

రేపటి (మే 30) ఆరంభ మ్యాచ్​కు ఆతిథ్యమివ్వనుంది ఓవల్​ మైదానం. వంద టెస్టు మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన తొలి స్టేడియంగానే కాకుండా.. టెస్టు చరిత్రలో తొలి వేదికగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 1845లో నిర్మించిన ఈ స్టేడియంలో... తొలి టెస్టు 1880లో జరిగింది. 1973 నుంచి ఇక్కడ వన్డే మ్యాచ్​లు జరుగుతున్నాయి. 2014 మే నెలలో తొలి టీ20 మ్యాచ్​ నిర్వహించారు. దీన్ని ప్రస్తుతం కియా ఓవల్​గా పిలుస్తున్నారు. ఇప్పటివరకు 10 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది ఈ స్టేడియం. పేసర్లకు స్వర్గధామం వంటి ఈ పిచ్‌పై బ్యాటింగ్ కష్టమనే చెప్పొచ్చు.

the oval, london
ది ఓవల్, లండన్

సామర్థ్యం: 25,500
నిర్వహణ: 5 మ్యాచ్​లు( ఆస్ట్రేలియా X భారత్​ మ్యాచ్​ )

ఓల్డ్​ ట్రఫార్డ్​, మాంచెస్టర్

ఇప్పటివరకు నాలుగు వరల్డ్‌కప్‌ మ్యాచ్​లకు ఆతిథ్యమిచ్చిన ఓల్డ్​ ట్రఫార్డ్​ స్టేడియం ఇప్పుడు సెమీఫైనల్​ సహా ఆరు మ్యాచ్‌లకు వేదిక. పేస్‌కు అనుకూలించే పిచ్‌పై స్వింగ్ రాబట్టగలిగే బౌలర్లు ఇక్కడ సత్తాచాటే అవకాశం ఉంది.

సామర్థ్యం: 26వేల 600

old trafford
ఓల్డ్ ట్రఫర్డ్
నిర్వహణ: 6 మ్యాచ్‌లు( జూన్​ 16న భారత్ X పాక్​ ​, జూన్​ 27న భారత్​ X వెస్టిండీస్​)

ట్రెంట్​ బ్రిడ్జ్​, నాటింగ్‌హామ్

గతేడాది ఇంగ్లాండ్​ పర్యటనలో భాగంగా భారత స్పిన్నర్​ కుల్దీప్ యాదవ్ 6 వికెట్లు పడగొట్టింది ట్రెంట్​బ్రిడ్జ్​ స్టేడియంలోనే. పేస్‌తో పాటు స్పిన్‌కూ అనుకూలిస్తుంది. వన్డేల్లో అత్యధిక స్కోరు నమోదైంది ఇక్కడే. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ 6 వికెట్లకు 481 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నమోదు చేశారు.

trent bridge
ట్రెంట్​బ్రిడ్జ్

సామర్థ్యం: 17వేల 500
నిర్వహణ: 5 మ్యాచ్​లు(జూన్​ 13- భారత్ ​X న్యూజిలాండ్​)

రోజ్​ బౌల్​, సౌతాంప్టన్

రోజ్​ బౌల్​ స్టేడియంలో 2003 నుంచి వన్డే మ్యాచ్​లు నిర్వహిస్తున్నారు. 2008లో మరమ్మతుల కారణంగా మూసివేసి 2015లో మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చారు. వరల్డ్‌కప్‌నకు ఆతిథ్యమిస్తున్న అన్ని స్టేడియాల్లో నూతనమైనదిదే. ఈ ప్రపంచకప్​లో 5 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది. ఈ మైదానంలో ప్రపంచకప్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి.

southmpton
రోజ్ బౌల్, సౌతాంప్టన్

సామర్థ్యం: 17,000
నిర్వహణ: 5 మ్యాచ్​లు( జూన్​ 5న భారత్​ X దక్షిణాఫ్రికా, జూన్​ 22న భారత్​ X అఫ్గానిస్థాన్​)

కంట్రీ గ్రౌండ్​, టాంటన్
మెగాటోర్నీకి ఆతిథ్యమిస్తున్న అన్ని మైదానాల్లో తక్కువ సామర్థ్యం కలిగినది టాంటన్. 1882లో ప్రారంభమైన ఈ స్టేడియంలో 1983లో తొలి వన్డే మ్యాచ్​ను నిర్వహించారు. 1999 వరల్డ్‌కప్‌లో శ్రీలంకపై గంగూలీ 183, ద్రవిడ్ 145 పరుగులతో అదరగొట్టారు.

country ground
కంట్రీ గ్రౌండ్
సామర్థ్యం: 12 వేల 500

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
COMING UP ON ENTERTAINMENT DAILY NEWS
1300
LONDON_ Julianne Moore talks about her new character, also known as 'Gloria Bell.'
2100
NASHVILLE_ Country star Randy Travis reveals all in new memoir.
2200
LOS ANGELES_ Millie Bobby Brown and other stars of 'Godzilla: King of the Monsters' discuss the latest in the long-running monster franchise.
COMING UP ON CELEBRITY EXTRA
CANNES_ Director Ken Loach and writer Paul Laverty talk about how the UK public is currently engaging with politics.
LOS ANGELES_ Actors reflect on aspects of life that were better during 'Deadwood' days – Pt 2
BROADCAST VIDEO ALREADY AVAILABLE
NEW YORK_ Tony nominee Jeff Daniels, cast on the contemporary relevance of 'To Kill a Mockingbird.'
ARCHIVE_ Britney Spears' restraining order on ex-manager extended.
ARCHIVE_ Kit Harington checks into wellness center to work on issues.
N/A_ 'Jeopardy' champ James Holzhauer nears Ken Jennings' record.
NEW YORK_ Feeling Aretha's spirit, Jennifer Hudson honors Aretha Franklin at Pulitzers; embraces Parkland students.
NEW YORK_ As an angel and a demon, Michael Sheen and David Tennant are unlikely friends in 'Good Omens.'
METAIRIE, Louisiana_ Bald eaglet released after 2 weeks in hospital.
Last Updated : May 30, 2019, 9:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.