తనకు కరోనా సోకిందేమోనని అనుమానంగా ఉన్నట్లు ఇంగ్లాండ్ స్పిన్నర్ జాక్‌లీచ్ చెప్పాడు. వైరస్ సంబంధించిన లక్షణాలు కనిపిస్తున్నాయని అన్నాడు. గతంలో దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడే ఈ వైరస్ సోకి ఉండొచ్చని వెల్లడించాడు.
ఇప్పటికే లీచ్.. ఫ్లూ, క్రోన్ వంటి వ్యాధులతో బాధపడుతున్నాడు. వీటివల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి వైరస్ సోకే ప్రమాదం ఉంది.
వచ్చే నెలలో స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగబోయే టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు. దీనిని బయో సెక్యూర్ వాతవారణంలో నిర్వహించనున్నారు. ఇందుకోసం జాక్‌లీచ్ క్వారంటైన్లో ఉన్నాడు. ఇతడితో పాటు మరో 29 మంది క్రికెటర్లు స్వీయనిర్భంధంలోనే ఉన్నారు.
ఇది చూడండి : 'ఆరేళ్లలో ధోనీ కెప్టెన్సీలో చాలా మార్పులు'