మహిళా టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ ఘోరపరాజయం చవిచూసింది. ఫీల్డింగ్‌లో తీవ్రమైన తప్పిదాలు చేసింది టీమిండియా. కీలక బ్యాటర్ల క్యాచ్‌లు మిస్ చేసిన కారణంగా భారీ మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్ అనంతరం జట్టు వైఫల్యాలపై భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ స్పందించింది.
"టీ20 ప్రపంచకప్ లీగ్ దశలోని అన్ని మ్యాచ్‌లలో అత్యుత్తమ ప్రదర్శన చేశాం. కానీ, ఫైనల్లో ఓటమి ఎదురైంది. అయినా, జట్టుపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఫీల్డింగ్‌లో అనుకోని తప్పిదాలు జరిగాయి. అందుకే ఫలితం ఇలా వచ్చింది. ప్రతి ఏడాది జట్టు మెరుగవ్వుతోంది. దానికి ఉదాహరణ ఫైనల్‌కు చేరటమే. తర్వాతి టీ20 ప్రపంచకప్‌ను కచ్చితంగా సాధిస్తామన్న నమ్మకం ఉంది."
- హర్మన్‌ప్రీత్ కౌర్, టీమిండియా మహిళా జట్టు కెప్టెన్
షెఫాలీది చిన్న వయసు
షెఫాలీ, స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్.. మ్యాచ్‌లో రెండు కీలక క్యాచ్‌లను జారవిడిచారు. వీరిద్దరి వల్లే జట్టు భారీ మూల్యం చెల్లించుకుందని విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో షెఫాలీకి మద్దతుగా నిలిచింది టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్. తనదింకా చిన్న వయసే అని.. మొదటి సారి ప్రపంచకప్ ఆడుతున్న క్రమంలో ఒత్తిడిని ఎదుర్కోలేక పోయిందని తెలిపింది హర్మన్. ఈ టోర్నీలో జట్టు సాధించిన విజయాల్లో షెఫాలీ పాత్ర కచ్చితంగా ఉందని ఆమె వెల్లడించింది.
ఇదీ చూడండి.. మొన్న రోహిత్.. నిన్న జైస్వాల్.. నేడు షెఫాలీ