ETV Bharat / sports

'అప్పుడు.. ఒక జత షూ, రెండు టీషర్టులే ఉండేవి'

author img

By

Published : Oct 10, 2019, 9:07 AM IST

ఐపీఎల్​లోకి రాకముందుకు టీమిండియా స్టార్ బౌలర్ జస్​ప్రీత్​ బుమ్రా దగ్గర సరైన బట్టలు, షూలు కూడా లేవని తెలిపారు అతని తల్లి దల్జీత్. ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసింది ముంబయి ఇండియన్స్ జట్టు.

బుమ్రా

జస్​ప్రీత్​ బుమ్రా.. ప్రస్తుతం ప్రపంచంలోనే స్టార్ బౌలర్. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ వాణిజ్య ఒప్పందాలతో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. అయితే యుక్త వయసులో అతడికి సరైన బట్టలు, షూలు కూడా ఉండేవి కావట. ఈ ఇబ్బందుల గురించి బుమ్రా, అతడి తల్లి వెల్లడించిన ఓ వీడియోను ముంబయి ఇండియన్స్ ట్విట్టర్లో షేర్ చేసింది.

"మేం అప్పుడు ఏం కొనాలన్నా ఇబ్బందే. క్రికెట్‌ ఆడటం మొదలయ్యాక నా దగ్గర ఒక జత షూ, రెండు టీషర్టులు మాత్రమే ఉండేవి. వాటినే మళ్లీ మళ్లీ ఉతుక్కొని వేసుకునేవాడిని" -జస్​ప్రీత్​ బుమ్రా, టీమిండియా పేసర్

"మొదటి సారి బుమ్రా ఐపీఎల్​లో ఆడుతున్నప్పుడు టీవీలో చూసిన నేను.. ఏడవకుండా ఉండలేకపోయా. శారీరకంగానే కాకుండా ఆర్థికంగానూ బుమ్రా ఎంతో కష్టపడ్డాడు. ఒకసారి దుకాణంలో ఖరీదైన షూలు చూసి ఎప్పటికైనా వాటిని కొంటానన్నాడు. ఇప్పుడు బుమ్రా దగ్గర ఎన్నో రకాల షూలు ఉన్నాయి" - దల్జీత్, బుమ్రా తల్లి

2013లో ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు బుమ్రా. ఆరేళ్లలోనే ప్రపంచ నంబర్​ వన్ బౌలర్​గా ఎదిగాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికా సిరీస్​కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం లండన్​లో చికిత్స తీసుకుంటున్నాడు.

ఇదీ చదవండి: సిరీస్​పై కన్నేసిన భారత్.. విజయం కోసం సఫారీల చూపు!

Pune (Maharashtra), Oct 09 (ANI): While addressing an event in Pune, Ladakh MP and BJP leader Jamyang Tsering Namgyal said that those who want to exploit the resources should not come to Ladakh. "Those who want to exploit the resources in Ladakh should not come there. Those who want to explore the region are most welcome. Ladakh is becoming popular as a tourist destination. You will be surprised to know that nearly 20 years ago women in Ladakh initiated to stop use of single-use plastic."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.