ETV Bharat / sports

'ఐపీఎల్​ కప్ ఈసారి పక్కా హైదరాబాద్​దే' - హైదరాబాద్​ యువకులు

క్వాలిఫయర్​-2 పోరులో హాట్​ ఫేవరెట్​గా బరిలోకి దిగుతోంది వార్నర్​ సేన.. ఈ నేపథ్యంలో సన్​రైజర్స్​​ విజయంపై హైదరాబాద్​ యువత ధీమా వ్యక్తం చేస్తోంది. దిల్లీని ఓడించి సన్​రైజర్స్​ ఆటగాళ్లు ఫైనల్​కు దూసుకెళ్తారని ఆశిస్తోంది.

hyderabadies hopes sunrisers will definitely ipl trophy in this season
'పక్కా ఈ సారి ఐపీఎల్​ కప్ సన్​రైజర్స్​దే'
author img

By

Published : Nov 8, 2020, 11:31 AM IST

వరుస విజయాలతో హైదరాబాద్​.. పరాజయాలతో దిల్లీ.. ఎలిమినేటర్​ పోరులో భాగంగా ఈ రెండు జట్లు ఆదివారం అబుదాబి వేదికగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో సన్​రైజర్స్​ గెలుపుపై హైదరాబాద్​ యువకులు ధీమాగా ఉన్నారు. ఈ మ్యాచ్​లో దిల్లీపై విజయం సాధించి తమ అభిమాన జట్టు ఫైనల్​కు దూసుకెళ్తుందని అంటున్నారు. వార్నర్​ సేన సమష్టి ప్రదర్శనతో అదరగొడుతున్నారని చెబుతున్నారు. మొదటి నుంచి ఆటగాళ్లంతా కష్టపడి ఆడుతున్నారని చెప్పారు.

'పక్కా ఈ సారి ఐపీఎల్​ కప్ సన్​రైజర్స్​దే'

వార్నర్​, హోల్డర్​, విలియమ్సన్​, మనీశ్​, ప్రియమ్ గార్గ్​లు.. బ్యాటింగ్​లో అదరగొడతారని చెప్పిన హైదరాబాద్​ కుర్రాళ్లు.. రషీద్​ ఖాన్​, సందీప్​ శర్మ, నటరాజన్​లు బౌలింగ్​తో ప్రత్యర్థులను చిత్తు చేస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచస్థాయి ఆటగాళ్లున్న దిల్లీతో మ్యాచ్​ రసవత్తరంగా సాగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ, విజయం మాత్రం వార్నర్​ సేనదేనని తెలిపారు.

2016లో హైదరాబాద్​ సాధించిన విజయాన్నే ఈ సారి తిరిగి నమోదు చేస్తుందని ఇక్కడి యువత అంటున్నారు. ఫైనల్లోనూ ముంబయిపై గెలిచి కప్​ సొంతం చేసుకుంటారని అన్నారు.

ఇదీ చూడండి:దిల్లీ vs హైదరాబాద్: ఫైనల్​కు వెళ్లేది ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.