ETV Bharat / sports

'ధోనీ నా వయసుపై కామెంట్లు చేసేవాడు'

author img

By

Published : Aug 4, 2020, 6:53 PM IST

Updated : Aug 4, 2020, 7:01 PM IST

టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్​ ధోనీ సరదా కామెంట్లతో తనను ఆటపట్టించేవాడని అన్నాడు భారత పేసర్​ ఇషాంత్​ శర్మ. ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

How MS Dhoni teases Ishant Sharma
ధోనీ, ఇషాంత్ శర్మ

భారత ఫాస్ట్ బౌలర్​ ఇషాంత్​ శర్మ సెప్టెంబరు 2 నాటికి 32 ఏళ్లు పూర్తి చేసుకోనున్నాడు. ఈ క్రమంలోనే తన వయసుకు సంబంధించి.. భార్య ప్రతిమతో పాటు, మహేంద్ర సింగ్​ ధోనీ ఎలా ఆటపట్టిస్తాడో చెప్పాడు. ఇటీవలే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలు పంచుకున్నాడు.

How MS Dhoni teases Ishant Sharma
ధోనీ, ఇషాంత్ శర్మ

"నిజానికి మానసికంగా 32ఏళ్ల కంటే ఎక్కువగా పెరిగా. నా భార్య ఎప్పుడూ నన్ను ఓల్డ్​ అంటూ పిలుస్తుంది. ఇక మాహీ భాయ్​ అయితే, ఎలా ఉన్నావ్ పెద్దాయన? అని అడుగుతాడు. ​నీ వయసు 32 ఏళ్లు మాత్రమే.. కానీ 52 ఏళ్లలా ఎదిగావు.. అంటూ ఆటపట్టిస్తాడు."

-ఇషాంత్​ శర్మ, భారత బౌలర్​

2007లో క్రికెట్​లో అరంగేట్రం చేసిన ఇషాంత్​.. ధోనీతో మంచి స్నేహాన్ని సంపాదించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్​ అనుభవం పరంగా.. ఇషాంత్​కు ధోనీ మూడేళ్లు సినియర్​. మరోవైపు టెస్టు క్రికెట్​లో మరో మూడు వికెట్లు తీస్తే.. 300 వికెట్లు తీసిన ఆరో భారత బౌలర్​గా గుర్తింపు సాధించనున్నాడు ఇషాంత్​.

Last Updated : Aug 4, 2020, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.