ETV Bharat / sports

గంటలో సెంచరీ చేసిన భారత క్రికెటర్ ఎవరంటే? - badrinath cricket records

తనకు చెప్పిమరీ ఓ భారత క్రికెటర్, గంటలో సెంచరీ కొట్టాడని వెల్లడించాడు మాజీ బౌలర్ లక్ష్మీపతి బాలజీ. ఇంతకీ అతడు ఎవరు? అసలేం జరిగింది?

గంటలో సెంచరీ చేసిన భారత క్రికెటర్
క్రికెటర్ సుబ్రహణ్యం బద్రీనాథ్
author img

By

Published : Aug 1, 2020, 6:11 PM IST

2000లోని టీమ్​ఇండియాలో గంగూలీ, సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్​, సెహ్వాగ్​ లాంటి అద్భుతమైన బ్యాట్స్​మెన్ ఉన్నారు. అలాంటి ఆ సమయంలో మరో క్రికెటర్​ దేశీయంగా ఎంత బాగా ఆడినా సరే, భారత జట్టులో చోటు దక్కించుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది. దీంతో చాలామంది ఆటగాళ్లకు అవకాశాల్లేక తెరవెనుకే ఉండిపోయారు. అలాంటి వారిలో సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ ఒకడని చెప్పాడు మాజీ బౌలర్ లక్ష్మీపతి బాలాజీ. ఓ సెషన్​లో ఎన్ని పరుగులు కొడతాడో తను ముందే చెప్పేసేవాడని అన్నాడు. అతడితో తనకున్న అనుబంధాన్ని 'ఫార్ములా ఫర్ సక్సెస్​' యూట్యూబ్​ షోలో పంచుకున్నాడు.

L Balaji lavishes praise on former India batsman badrinath
బద్రీనాథ్​తో లక్ష్మీపతి బాలాజీ

"ఎవరైనా క్రికెటర్​ సెంచరీ కొడతానని మ్యాచ్​కు ముందే చెప్పడం మీరు ఎప్పుడైనా విన్నారా? 2005లో నాకు బద్రీనాథ్ విషయంలో అలాంటి అనుభవమే ఎదురైంది. ఒకానొక దశలో బెస్ట్ స్పిన్నర్లు బౌలింగ్ చేస్తుండగా, గంటలో శతకం కొడతానని బద్రీ నాతో చెప్పాడు. ఆ సెషన్​లో బౌలర్లను ఆడుకుని తను అన్నట్లే చేశాడు"

-లక్ష్మీపతి బాలజీ, భారత మాజీ బౌలర్

బద్రీనాథ్, తన తొలి రంజీ మ్యాచ్​లో కేవలం ఓ సెషన్​లోనే సెంచరీ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు బాలాజీ. ఓ సందర్భంలో ఆరోగ్యం సహకరించకున్నా సరే బ్యాటింగ్​ చేసి, ఓ మ్యాచ్​ను గెలిపించాడని అన్నాడు.

badrinath
సీనియర క్రికెటర్ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్

దేశీయ క్రికెట్​లో 10, 245 పరుగులు చేసిన బద్రీనాథ్.. భారత్​ తరఫున 2 టెస్టులు, 7 వన్డేలు, ఓ టీట్వంటీ ఆడాడు. ఐపీఎల్​లోనూ చెన్నై సూపర్​కింగ్స్​కు ప్రాతినిధ్యం వహించి 1441 పరుగులు చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.