ETV Bharat / sports

'అతను ఇంకా ఆడుతుంటే.. నేను సోఫాలోనే ఉన్నా'

ఇంగ్లాండ్​ స్టార్​ పేసర్ జేమ్స్ అండర్సన్​పై సరదా వ్యాఖ్యలు చేశాడు దక్షిణాఫ్రికా పేసర్​ డేల్ స్టెయిన్. వయసు పెరిగే కొద్దీ అతడు మెరుగ్గా ఆడుతున్నాడని కితాబిచ్చాడు.

author img

By

Published : Feb 11, 2021, 7:46 PM IST

He is still going, I'm watching from sofa: Dale Steyn on comparison with Anderson
'అతను ఇంకా ఆడుతుంటే.. నేను సోఫాలోనే ఉన్నా'

తొలి టెస్టులో భారత్​పై ఇంగ్లాండ్​ ఘన విజయం సాధించడంలో సీనియర్​ ఫాస్ట్​ బౌలర్ అండర్సన్​ కీలక పాత్ర పోషించాడు. అద్భుత బౌలింగ్​ నైపుణ్యంతో గిల్, రహానె, పంత్​లను తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేర్చాడు. అయితే ఆసియా పరిస్థితుల్లో అండర్సన్, స్టెయిన్​ల ప్రదర్శనలను పోల్చడంపై సరదాగా స్పందించాడు స్టెయిన్.

"ఇప్పుడు అవసరమైన పోలిక ఏంటంటే.. జిమ్మీ (అండర్సన్) ఇంకా దూసుకుపోతుంటే.. నేను మాత్రం నా సోఫాలో కూర్చుని మ్యాచ్​ చూస్తున్నా. అతడు ఓ దిగ్గజం. వయసు పెరిగే కొద్దీ మరింత గొప్పగా రాణిస్తున్నాడు." అని స్టెయిన్ ట్వీట్ చేశాడు.

ద్విశతకంతో అదరగొట్టిన ఇంగ్లాండ్​ కెప్టెన్ జో రూట్ కూడా తన సహఆటగాడు అండర్సన్​ను పొగడ్తల్లో ముంచెత్తాడు. అతడి ప్రదర్శన చూస్తుంటే 2005లో ఆస్ట్రేలియాను అద్భుత బౌలింగ్​తో వణికించిన ఫ్లింటాఫ్​ గుర్తుకొచ్చాడని చెప్పాడు.​

చెన్నైలో భారత్​తో జరిగిన తొలి టెస్టులో 227 పరుగుల భారీ తేడాతో గెలిచింది ఇంగ్లాండ్. రూట్, స్టోక్స్​ మెరుపులతో పాటు 6 వికెట్లతో లీచ్, 5 వికెట్లతో అండర్సన్ టీమ్​ఇండియాను దెబ్బతీశారు.

ఇదీ చూడండి: 'పుజారాను ఎదుర్కోవడమంటే యుద్ధం చేసినట్లే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.