ETV Bharat / sports

వారిద్దరి బౌలింగ్ అంటే రోహిత్ శర్మకు హడల్ - bret lee-rohi sharma-dale steyn

అంతర్జాతీయ క్రికెట్​లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో బ్రెట్​లీ, స్టెయిన్​ బౌలింగ్​తో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పాడు రోహిత్.

'వారిద్దరి బౌలింగ్ అంటే నాకు హడల్'
రోహిత్ శర్మ
author img

By

Published : May 3, 2020, 10:56 AM IST

తన కెరీర్​ ప్రారంభంలో బ్రెట్​లీ(ఆస్ట్రేలియా), స్టెయిన్(దక్షిణాఫ్రికా)లను ఎదుర్కొనేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడ్డానని చెప్పాడు భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ. లాక్​డౌన్​తో ఇంట్లోనే ఉన్న ఈ ఓపెనర్.. బౌలర్ షమితో జరిగిన లైవ్​చాట్​లో ఈ విషయాన్ని వెల్లడించాడు.

"నేను టీమిండియాలోకి వచ్చినప్పుడు బ్రెట్​లీ అత్యంత వేగవంతమైన బౌలర్. దక్షిణాఫ్రికాతో నా తొలివన్డే ఆడేందుకు ఐర్లాండ్​ వెళ్లా. ఆ జట్టులోని స్టెయిన్ వేగంగా బంతులేశాడు. అప్పట్లో వీరిద్దరిని ఎదుర్కొనేందుకు బాగా ఇబ్బందిపడ్డా. ప్రస్తుతం అయితే రబాడా(దక్షిణాఫ్రికా), హేజిల్​వుడ్(ఆస్ట్రేలియా) చక్కని బౌలర్లు" -రోహిత్ శర్మ, స్టార్ ఓపెనర్

bret lee-rohi sharma-dale steyn
బ్రెట్ లీ- రోహిత్ శర్మ-స్టెయిన్

2007లో దక్షిణాఫ్రికా, ఐర్లాండ్​, టీమిండియా మధ్య జరిగిన ముక్కోణపు సిరీస్​తో అంతర్జాతీయ కెరీర్​ను ప్రారంభించాడు రోహిత్ శర్మ. ఆ తర్వాత పలుస్థానాల్లో బ్యాటింగ్​ చేసిన ఇతడు.. 2013 నుంచి ఓపెనర్​గా జట్టుకు సేవలందిస్తున్నాడు.

ఇప్పటివరకు వన్డేల్లో మూడు ద్విశతకాలు చేసి, ఎవరికీ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడు. గతేడాది వన్డే ప్రపంచకప్​లోనూ సత్తా చాటిన హిట్​మ్యాన్.. 648 పరుగులు చేసి, ప్లేయర్​ ఆఫ్​ టోర్నీగా నిలిచాడు. ఇందులో ఐదు సెంచరీలు బాది, ఓ ప్రపంచకప్​లో ఇన్ని శతకాలు చేసిన తొలి బ్యాట్స్​మన్​గా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం టీమిండియాకు ఉపసారథిగా ఉన్న రోహిత్.. 224 వన్డేలు, 32 టెస్టులు, 108 టీ20లు ఆడాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.