భారత జట్టు మాజీ సారథి రాహుల్ ద్రవిడ్‌కు విరుద్ధ ప్రయోజనాల కింద బీసీసీఐ నోటీసులివ్వడంపై మాజీ ఆటగాళ్లు గంగూలీ, హర్భజన్ స్పందించారు. వార్తల్లో నిలవాలనే ఉద్దేశంతోనే ఈ అంశాన్ని ఉపయోగించుకొంటున్నట్లు అభిప్రాయపడ్డారు.
" భారత క్రికెట్లో కొత్య ఫ్యాషన్ మొదలైంది. అదే పరస్పర విరుద్ధ ప్రయోజనం. ఇది వార్తల్లో ఉండాలనుకుంటున్నారు. ఇందులో భాగంగానే బీసీసీఐ ఎథిక్స్ అధికారి నుంచి ద్రవిడ్ నోటీసులు అందుకున్నాడు. ఇక క్రికెట్‌ను దేవుడే రక్షించాలి ".
-- సౌరవ్ గంగూలీ, భారత మాజీ క్రికెటర్
గంగూలీ ట్వీట్లపై హర్భజన్ స్పందించాడు. ఈ విధంగా దిగ్గజ ఆటగాళ్లకు నోటీసులు పంపి అవమానించొద్దని పరోక్షంగా సూచించాడు.
" నిజమేనా...?? ఇది ఎక్కడ వరకు వెళ్తుందో తెలియదు. ద్రవిడ్ కన్నా మంచి వ్యక్తిని భారత క్రికెట్ మళ్లీ తీసుకురాలేదు. ఇలాంటి దిగ్గజాలకు నోటీసులు పంపడం అంటే అవమానపరచడమే. భవిష్యత్తులో ఆటను మరింత ముందుకు తీసుకెళ్లాలంటే వారి సేవలు అవసరం. ఆ దేవుడే భారత క్రికెట్‌ను రక్షించాలి ".
-- హర్భజన్ సింగ్, భారత మాజీ క్రికెటర్
-
Really ?? Don’t know where it’s heading to.. u can’t get better person thn him for indian cricket. Sending notice to these legends is like insulting them.. cricket need their services for betterment.. yes god save indian cricket 🙏 https://t.co/lioRClBl4l
— Harbhajan Turbanator (@harbhajan_singh) August 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Really ?? Don’t know where it’s heading to.. u can’t get better person thn him for indian cricket. Sending notice to these legends is like insulting them.. cricket need their services for betterment.. yes god save indian cricket 🙏 https://t.co/lioRClBl4l
— Harbhajan Turbanator (@harbhajan_singh) August 6, 2019Really ?? Don’t know where it’s heading to.. u can’t get better person thn him for indian cricket. Sending notice to these legends is like insulting them.. cricket need their services for betterment.. yes god save indian cricket 🙏 https://t.co/lioRClBl4l
— Harbhajan Turbanator (@harbhajan_singh) August 6, 2019
ఇటీవలే జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) హెడ్‌గా బాధ్యతలు చేపట్టాడు ద్రవిడ్. ఈ నియామకం విరుద్ధ ప్రయోజనాల అంశంలో భాగమని బీసీసీఐ అంబుడ్స్‌మన్ జస్టిస్ డీకే జైన్‌కు... ఫిర్యాదు చేశాడు మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం సభ్యుడు సంజీవ్ గుప్తా. ఫలితంగా మిస్టర్ వాల్‌కు నోటీసులు అందాయి. రెండు వారాల్లో ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ద్రవిడ్‌ను ఆదేశించాడు జైన్.
గతంలో ఇండియా సిమెంట్స్ సంస్థలో వైస్‌ఛైర్మన్ పదవిలో ఉండేవాడు ద్రవిడ్. ఎన్సీఏ అధ్యక్ష పదవి చేపట్టేముందు ఆ బాధ్యతలకు రెండేళ్ల కాలానికి తాత్కాలిక విరామం ప్రకటించాడు.
ఇవీ చూడండి...జాతీయ క్రికెట్ అకాడమీ అధ్యక్షుడిగా రాహుల్