ETV Bharat / sports

నేను చూసిన జైసింహా అతడే: గావస్కర్ - నేను చూసిన జైసింహా అతడే: గావస్కర్

టీమ్ఇండియా లెజెండ్ సునీల్ గావస్కర్ ఆరాధ్య క్రికెటర్ ఎమ్ఎల్ జైసింహా. చిన్నతనంలో జైసింహా ఆట చూసి, ఆ తర్వాత అతనితో కలిసి ఆడే అవకాశం దక్కించుకున్న గావస్కర్‌.. తన ఆరాధ్య ఆటగాడిని ఎప్పుడూ తలచుకుంటూనే ఉంటాడు. తాజాగా హైదరాబాద్ విచ్చేసిన గావస్కర్.. జైసింహా స్పోర్ట్స్ ఫౌండేషన్​ ప్రారంబోత్సవంలో ఉపన్యాసం ఇచ్చాడు. తన మనసులోని భావాలను పంచుకున్నాడు.

Gavaskar recalls memories of Jai simha
గావస్కర్
author img

By

Published : Mar 30, 2021, 8:16 AM IST

సునీల్‌ గావస్కర్‌..! పరిచయం అక్కర్లేని భారత క్రికెట్‌ దిగ్గజం. దూకుడైన ఆటతో ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన ఈ మాజీ కెప్టెన్‌.. సచిన్‌ సహా ఎంతోమంది అగ్రశ్రేణి ఆటగాళ్లకు ఆదర్శంగా నిలిచాడు. అలాంటి గావస్కర్‌కు ఓ ఆటగాడంటే చెప్పలేనంత అభిమానం. ఆ క్రికెటర్‌ మన హైదరాబాదీనే.. దివంగత ఎమ్‌ఎల్‌ జైసింహా. చిన్నతనంలో జైసింహా ఆట చూసి, ఆ తర్వాత అతనితో కలిసి ఆడే అవకాశం దక్కించుకున్న గావస్కర్‌.. తన ఆరాధ్య ఆటగాడిని ఎప్పుడూ తలచుకుంటూనే ఉంటాడు.

తన హీరో గురించి ప్రసంగించే అవకాశం రావడం వల్ల తన మనసులోని భావాలన్నింటినీ బయటపెట్టాడు గావస్కర్. అందుకు సికింద్రాబాద్‌లోని ఎమ్‌ఎల్‌ జైసింహా స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ వేదికైంది. ఇటీవల అతని 82వ జయంతి సందర్భంగా జైసింహా అకాడమీ పేరును ఎమ్‌ఎల్‌ జైసింహా స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌గా మార్చారు. అందులో జైసింహా గురించి తొలి ఉపన్యాసమిచ్చే అవకాశం దక్కించుకున్న గావస్కర్‌.. సోమవారం భావోద్వేగంతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సన్నీ ఏం చెప్పాడంటే.

Gavaskar recalls memories of Jai simha
జైసింహ తనయుడు విద్యుత్, భార్య జయంతితో సన్నీ

"ప్రపంచంలో నేను ఆరాధించేది ఒక్కరినే.. అతనే ఎమ్‌.లక్ష్మీనర్సు జైసింహా. నేనెప్పటికీ అతని అభిమానినే. అతనెప్పటికీ నా హీరోనే. నా హీరో గురించి మాట్లాడే అవకాశం రావడం నాకు గర్వకారణం. నా పదేళ్ల వయసులో 1959లో అతనికి అభిమానిగా మారా. అప్పటి అతని బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో చూస్తే ఇప్పటికీ నా మనసు ఉప్పొంగిపోతోంది. అదే ఏడాది ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో అతను అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశారు. ఆ సిరీస్‌లో అతను ఒక్క మ్యాచే ఆడినప్పటికీ.. తన బ్యాటింగ్‌ శైలి, మైదానంలో వ్యవహరించే తీరు, టీషర్ట్‌ను టక్‌ చేసి, కాలర్‌ ఎగరేసి విధానం నన్ను కట్టిపడేసింది. ఆ ఏడాది ఆస్ట్రేలియా సిరీస్‌లో ఓ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి అయిదు రోజులు అంటే ప్రతి రోజు బ్యాటింగ్‌ చేసిన తొలి ఆటగాడిగా అతను రికార్డు సృష్టించారు. ఇప్పట్లో అయితే అది అసాధ్యం"

"13 ఇన్నింగ్స్‌ల్లో భారత్‌ తరపున ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు వచ్చి, బౌలింగ్‌ దాడినీ ఆరంభించారు. అతనో గొప్ప ఆల్‌రౌండర్‌. 1967-68 ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడ్డ చంద్రశేఖర్‌ స్థానంలో బ్రిస్బేన్‌లో మూడో టెస్టు కోసం జైసింహాను భారత్‌ నుంచి పిలిపించారు. అప్పట్లో విమానాల్లో ఆటగాళ్లు ఎకానమీ తరగతిలోనే ప్రయాణించాలి. అంత అవస్థలు పడి ప్రయాణం చేసిన అతను.. విమానం దిగి నేరుగా మ్యాచ్‌ ఆడి అదరగొట్టారు. ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో అతను 74, రెండో ఇన్నింగ్స్‌లో 101 పరుగులు చేశారు. అంత దూరం ప్రయాణం తర్వాత.. ఆ అలసట గురించి పట్టించుకోకుండా, అక్కడి కఠిన పరిస్థితులకు ఎదురొడ్డి అతనాడిన ఇన్నింగ్స్‌లు నాపై చెరగని ముద్ర వేశాయి."

ఆ తొలి మాటలు..

"ముంబయిలో ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేసే సమయంలో వెళ్తే జైసింహాను దగ్గరి నుంచి చూడొచ్చని అనుకున్నా. కానీ వాచ్‌మన్‌ మమ్మల్ని లోపలికి పంపలేదు. ఆ పక్కనే టెన్నిస్‌ కోర్టు ఉంది. దానికి క్రికెట్‌ మైదానానికి మధ్యలో కంచె ఉంది. టెన్నిస్‌ కోర్టులోకి వెళ్తానని చెప్పి లోపలికి వెళ్లా. అప్పుడు బంతి మా వైపు వచ్చింది. ఆ కంచెకున్న రంధ్రాల నుంచి చేతులు పెట్టి బంతి అందుకున్నామని ప్రయత్నించా. అప్పుడక్కడికి వచ్చిన జైసింహా.. 'ఏం ఇబ్బంది పడకు. బంతిని వదిలేయ్‌. నేను తీసుకుంటా' అని అన్నారు. అతను నాతో మాట్లాడిన తొలి మాటలవి"

"ఆ తర్వాత 1971 వెస్టిండీస్‌ పర్యటన కోసం నా హీరోతో కలిసి ఒకే విమానంలో ప్రయాణం చేయడంతో ఆనందం పట్టలేకపోయా. ఇక మ్యాచ్‌లో అతనితో కలిసి బ్యాటింగ్‌ చేయడాన్ని నమ్మలేకపోయా. ఆట గురించి, అంతకుముందు సిరీస్‌ల గురించి అందరితో పంచుకునేవాడు. అతని నుంచి ఎంతో నేర్చుకున్నా. ఇంతకుముందు చెప్పినట్లుగానే నా తొలి టెస్టు సిరీస్‌ (విండీస్‌లో)లో నేను 774 పరుగులు చేసినందుకు బాధపడ్డా. అందులో కనీసం 300 పరుగులైనా జైసింహా, సలీమ్‌ దురానీకి పంచే వీలుంటే బాగుండేది. ఎందుకంటే ఆ సిరీస్‌ తర్వాత వాళ్ల కెరీర్‌ ముగింపు దిశగా సాగింది. జైసింహా తన గంభీరమైన స్వరంతో నన్ను గావస్కర్‌ అని పిలిచేవారు. ఇప్పటికీ అలా పిలవడం నా చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది"

"ప్రతి ఏడాది మార్చి 3న నవ్వు ముఖంతో నిద్రలేచి.. 'పుట్టినరోజు శుభాకాంక్షలు జైసింహా' అని మనసులోనే అనుకుంటా. అదే జులై 7న మాత్రం నిద్రలేవకూడదని కోరుకుంటా. అతను దూరమైంది ఆ రోజే. అది తలుచుకుంటే ఇప్పుడు కన్నీళ్లు ఆగడం లేదు. మాటలు రావట్లేదు. అనారోగ్యంతో అతను ఆసుపత్రిలో ఉన్నపుడు నేనెందుకు వెళ్లి చూడడం లేదని నా భార్య అడిగేది. అతణ్ని అలాంటి స్థితిలో చూడలేనని సమాధానం ఇచ్చేవాణ్ని. కానీ నువ్వు వెళ్తేనే జైసింహా సంతోషపడతాడని ఆమె చెప్పడం వల్ల హైదరాబాద్‌కు వచ్చా. అతనితో సమయం గడిపా. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయిన తర్వాత తను చనిపోయాడనే సందేశం వచ్చింది. బాధలో మునిగిపోయా. అయితే అదే జులై 7న పుట్టిన ధోనీని చూస్తే జైసింహా గుర్తుకువస్తారు. అతనిలాగే ధోనీకి క్రికెట్‌పై అంకితభావం ఎక్కువ. అందుకేనేమో ధోనీకి నేను అభిమానిని అయ్యా. జైసింహా టీమ్‌ఇండియా విజయాలను పైనుంచి చూస్తూ గర్వపడుతుంటారు. భారత క్రికెట్లో ప్రస్తుత జట్టే అత్యుత్తమం" అంటూ తన మనసులోని భావాలను పంచుకున్నాడు.

ఈ మార్పులు తేవాలి..

  • బ్యాట్స్‌మెన్‌ ఆటగా మారిపోయిన క్రికెట్లో బౌలర్లకూ ప్రాధాన్యం దక్కాలంటే కింది మార్పులవసరమని గావస్కర్‌ సూచించాడు.
  • బౌండరీల దూరాన్ని కనీసం అయిదు గజాలైనా పెంచాలి.
  • బౌలర్లకు ఆయుధమైన బౌన్సర్‌.. బ్యాట్స్‌మన్‌ హెల్మెట్‌పై నుంచి కాస్త ఎత్తులో వెళ్లగానే వైడ్‌ ఇవ్వకూడదు.
  • లెగ్‌బైలను పూర్తిగా తొలగించాలి. చేతిలో బ్యాట్‌ ఉన్నపుడు కాలికి బంతి తగిలితే పరుగులు ఇవ్వడం సరికాదు.
  • బ్యాట్స్‌మన్‌ను రనౌట్‌ చేసే ప్రయత్నంలో ఫీల్డర్‌ విసిరిన త్రో వికెట్లకు తాకగానే బంతిని డెడ్‌బాల్‌గా పరిగణించాలి.
  • ఔటైన ఆటగాడి స్థానంలో కొత్తగా క్రీజులో వచ్చే ఆటగాడు నిమిషంలోపే చేరుకోవాలనే నిబంధన పెట్టాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.