మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నాడు. పాకిస్థాన్‌కు చెందిన ఓ చిన్నారి శస్త్రచికిత్స కోసం భారత్ రావడానికి చొరవ తీసుకుని వీసాలు వచ్చేలా చేశాడు. వీసా జారీ చేసినట్లు భారత హైకమిషన్ లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు గంభీర్.
"అవతలి వైపు నుంచి ఓ పసి హృదయం మనల్ని సంప్రదించినప్పుడు అది మన కట్టుబాట్లు, హద్దులు పక్కన పెట్టేలా చేస్తుంది. తన చిన్ని చిన్ని పాదాలతో ఆ చిన్నారి మనకు తియ్యటి గాలిని తెస్తోంది. ఇది ఒక బిడ్డ తన పుట్టింటిని సందర్శించినట్లు ఉంది" - గౌతమ్ గంభీర్ ట్వీట్.
-
उस पार से एक नन्हे दिल ने दस्तक दी,
— Gautam Gambhir (@GautamGambhir) October 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
इस पार दिल ने सब सरहदें मिटा दी।
उन नन्हे कदमों के साथ बहती हुई मीठी हवा भी आई है,
कभी-कभी ऐसा भी लगता है जैसे बेटी घर आई है।
Thank u @DrSJaishankar 4 granting visa to Pakistani girl& her parents for her heart surgery @narendramodi @AmitShah pic.twitter.com/zuquO2hnMv
">उस पार से एक नन्हे दिल ने दस्तक दी,
— Gautam Gambhir (@GautamGambhir) October 19, 2019
इस पार दिल ने सब सरहदें मिटा दी।
उन नन्हे कदमों के साथ बहती हुई मीठी हवा भी आई है,
कभी-कभी ऐसा भी लगता है जैसे बेटी घर आई है।
Thank u @DrSJaishankar 4 granting visa to Pakistani girl& her parents for her heart surgery @narendramodi @AmitShah pic.twitter.com/zuquO2hnMvउस पार से एक नन्हे दिल ने दस्तक दी,
— Gautam Gambhir (@GautamGambhir) October 19, 2019
इस पार दिल ने सब सरहदें मिटा दी।
उन नन्हे कदमों के साथ बहती हुई मीठी हवा भी आई है,
कभी-कभी ऐसा भी लगता है जैसे बेटी घर आई है।
Thank u @DrSJaishankar 4 granting visa to Pakistani girl& her parents for her heart surgery @narendramodi @AmitShah pic.twitter.com/zuquO2hnMv
పాక్‌కు చెందిన ఉమామియా అలీ అనే చిన్నారి గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆ చిన్నారి కుటుంబం చికిత్స కోసం భారత్‌కు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయం తెలుసుకున్న గంభీర్.. వారికి వీసా ఇవ్వాలని కోరుతూ విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కోరాడు. ఈ విన్నపంపై మంత్రి స్పందించారు. ఆ ముగ్గురికి వీసాలు జారీ చేయాలని ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్‌కు సూచించారు. దీంతో ఆ కుటుంబానికి వీసాలు వచ్చాయి.
భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ వైద్య సేవల కోసం మానవీయ దృక్పథంతో పాక్ ప్రజలకు వీసాలు ఇవ్వడం ఇది మొదటిసారేం కాదు. గతంలో పలుసార్లు భారత్ ఇలా వీసాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో కోహ్లీకి విశ్రాంతి.!