ETV Bharat / sports

'గంగూలీ వ్యాఖ్యలతో యువ క్రికెటర్లకు భరోసా'

author img

By

Published : Jun 17, 2020, 6:03 PM IST

ఐపీఎల్​ను జరిపేందుకు తమవంతు ప్రయత్నం చేసున్నామని చెప్పిన గంగూలీ.. భారత యువక్రికెటర్లకు భరోసానిచ్చారని మాజీ ఆల్​రౌండర్​ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు​. ప్రతి ఆటగాడు టోర్నీ జరగాలని కోరుకుంటున్నారని చెప్పాడు.

Ganguly saying IPL will happen at some stage great news, says Pathan
'గంగూలీ వ్యాఖ్యలు ఆటగాళ్లకు భరోసా ఇచ్చాయి'

ఐపీఎల్​ను ఈ ఏడాది కచ్చితంగా నిర్వహిస్తామని బీసీసీఐ ఛైర్మన్​ సౌరవ్​ గంగూలీ ఇటీవలే చెప్పారు. అయితే ఈ మాటలు, క్రికెటర్లు భరోసా ఇచ్చాయని భారత మాజీ ఆల్​రౌండర్​ ఇర్ఫాన్​ పఠాన్ అభిప్రాయపడ్డాడు​. కరోనా ప్రభావంతో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరపడం​ కష్టమని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు​.

Ganguly saying IPL will happen at some stage great news, says Pathan
టీ20 ప్రపంచకప్​ ట్రోఫీ

"ఐపీఎల్​ను నిర్వహించేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నామని గంగూలీ ఇచ్చిన ప్రకటన​ను చదివాను. టోర్నీ జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఆస్ట్రేలియాలో జరగాల్సిన ప్రపంచకప్​ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. నాకు దానిపై సందేహాలున్నాయి. ఆస్ట్రేలియాలో నియమాలను కచ్చితంగా పాటిస్తారు. సమస్య ఎంత చిన్నదైనా వారి కట్టుబాట్ల ప్రకారం వెళ్తారు. ప్రపంచకప్​ను ఎలా నిర్వహించాలి.. దానికి సంబంధించిన నియమాలను ఎలా పాటించాలనేది ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.. ఐపీఎల్​ను కచ్చితంగా నిర్వహిస్తామని చేసిన వ్యాఖ్యలు, భారత యువక్రికెటర్లకు భరోసా ఇచ్చాయి. ఆ టోర్నీ ఎప్పుడు జరుగుతుందా అని నేను ఎదురుచూస్తున్నా"

- ఇర్ఫాన్​ పఠాన్​, భారత మాజీ ఆల్​రౌండర్​

టీ20 ప్రపంచకప్​ నిర్వహించాలని ఆస్ట్రేలియా బోర్డుకు ఆదేశాలు వస్తే.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ఆ దేశం కచ్చితంగా నియమ నిబంధనలను పాటిస్తుందని ఇర్ఫాన్​ పఠాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు​. అయితే ఈ టోర్నీ భవిష్యత్తుపై... జులైలో ఐసీసీ సమావేశం ఏర్పాటు చేసి, తుది నిర్ణయం తీసుకోనుంది.

ఐపీఎల్​ ట్రోఫీ

ఐపీఎల్​ మ్యాచ్​లు జరిపేందుకు సిద్ధంగా ఉండాలని ఇటీవలే రాష్ట్ర క్రికెట్​ సంఘాలకు సూచించారు గంగూలీ. మరోవైపు కరోనా సంక్షోభ సమయంలో టీ20 ప్రపంచకప్​ను నిర్వహించడం అసాధ్యమని క్రికెట్​ ఆస్ట్రేలియా తాజాగా వెల్లడించింది. దీంతో ఐపీఎల్​ నిర్వహణకు మార్గం సుగమమైంది. ఐపీఎల్​ను సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 వరకు జరపాలని బీసీసీఐ భావిస్తోంది.

ఇదీ చూడండి... వైద్యుడ్ని సస్పెండ్​ చేసిన చెన్నై సూపర్ కింగ్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.