ETV Bharat / sports

వరల్డ్​కప్​లో దాదా, వాల్​ కాంబినేషన్​ సూపర్​హిట్​ - sourav ganguly 183 runs news

టీమ్​ఇండియాకు దూకుడు నేర్పిన టైగర్​ సౌరభ్​ గంగూలీ ఓ వైపు, 'ది వాల్'​గా పేరున్న రాహుల్​ ద్రవిడ్​ మరో వైపు ఉండి ప్రపంచకప్​లో విధ్వంసకర ఇన్నింగ్స్​ ఆడారు. వీరిద్దరూ కలిసి 318 పరుగులు జోడించారు. టాంటన్​ వేదికగా ఆ సంచలన ఇన్నింగ్స్​ నమోదైంది ఈరోజే. వన్డే క్రికెట్​ చరిత్రలో ఇది నాలుగో అత్యధిక భాగస్వామ్యంగా ఉంది.

Ganguly, Dravid formed 318 run
దాదా, వాల్​ కాంబినేషన్​ సూపర్​హిట్​
author img

By

Published : May 26, 2020, 4:24 PM IST

భారత మాజీ క్రికెటర్లు సౌరభ్​ గంగూలీ, రాహుల్​ ద్రవిడ్.. మే 26న​ అరుదైన ఇన్నింగ్స్​ ఆడారు. ఇద్దరు స్టార్​ ఆటగాళ్లు కలిసి 318 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దాదాపు 21 ఏళ్లు పూర్తయిగా ఇంకా ఆనాటి మధుర జ్ఞాపకాలు.. క్రికెట్​ ప్రియుల మదిలో చిరస్థాయిగా ఉండిపోయాయి.

శ్రీలంకను వణికించారు...

ఇంగ్లాండ్‌లోని టాంటన్​ వేదికగా జరిగిన 1999 ప్రపంచకప్‌లో.. శ్రీలంక-భారత్​ మధ్య మ్యాచ్​ జరిగింది. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన టీమ్​ఇండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్​ సదాగోపన్​ రమేశ్​(5) తొలి ఓవర్​లోనే పెవిలియన్​ చేరాడు. ఆ తర్వాత బెంగాల్‌ టైగర్‌ గంగూలీ 183 పరుగులు(158 బంతుల్లో 17 ఫోర్లు, 7 సిక్సర్లు) రెచ్చిపోయాడు. దాదాకు తోడుగా రాహుల్‌ ద్రావిడ్‌ 145 (129 బంతుల్లో 17 ఫోర్లు, 1 సిక్సర్​)కూడా బ్యాట్​ ఝుళిపించగా.. 318 పరుగులు జోడించి ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించారు. ఐసీసీ ఈవెంట్లలో ఏ వికెట్‌కైనా ఇదే రెండో అత్యుత్తమ భాగస్వామ్యం కాగా వన్డే చరిత్రలో ఇదే నాలుగో అత్యధికం.

ఈ మ్యాచ్​లో 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 373 పరుగులు సాధించింది భారత్​. లక్ష్య ఛేదనలో 216 రన్స్​కే ఆలౌటైంది లంక. భారత బౌలర్లలో రాబిన్​ సన్​ 5 వికెట్లతో చెలరేగాడు. ఫలితంగా 157 పరుగుల తేడాతో గెలుపొందింది టీమ్​ఇండియా.

ఈ మ్యాచ్ ద్వారా ర‌న్‌రేట్‌ను మెరుగుప‌ర్చుకున్నభార‌త్.. సూప‌ర్ సిక్స్‌కు అర్హ‌త సాధించింది. ఈ టోర్నీలో సెమీఫైనల్స్​కు అర్హత సాధించాలంటే నెగ్గాల్సిన మ్యాచ్​లో.. న్యూజిలాండ్​ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది భారత్​. ప్ర‌పంచ‌క‌ప్‌లో తొలిసారి బ‌రిలోకి దిగిన గంగూలీ, ద్ర‌విడ్ మాత్రం అద్భుత ఇన్నింగ్స్​తో ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.