మ్యాచ్ ఫిక్స్ కుంభకోణం.. జట్టు సమష్టిగా ఆడటంలో విఫలం... కెప్టెన్సీ నుంచి వైదొలిగిన సచిన్.. ఇవన్నీ ఒకానొక సమయంలో టీమిండియా ఎదుర్కొంటున్న సమస్యలు. అలాంటి పరిస్థితుల్లో సారథ్య బాధ్యతలు చేపట్టి, గమ్యంలేని నడక సాగిస్తున్న భారత జట్టును సరైన మార్గంలో పరుగులు తీయించాడు సౌరభ్ గంగూలీ. 2000-05 మధ్యకాలంలో టీమిండియాకు కెప్టెన్‌గా ఉండి తనదైన మార్క్ చూపించాడు.
కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడిగానూ సత్తాచాటాడు గంగూలీ. విదేశాల్లో భారత గెలుపు ప్రస్థానానికి సరైన బాటలు వేశాడు. బుధవారం.. బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దాదా.. తన కెరీర్లో ఆడిన కొన్ని మరపురాని ఇన్నింగ్స్‌లు ఇప్పుడు చూద్దాం!
-
It's official - @SGanguly99 formally elected as the President of BCCI pic.twitter.com/Ln1VkCTyIW
— BCCI (@BCCI) October 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">It's official - @SGanguly99 formally elected as the President of BCCI pic.twitter.com/Ln1VkCTyIW
— BCCI (@BCCI) October 23, 2019It's official - @SGanguly99 formally elected as the President of BCCI pic.twitter.com/Ln1VkCTyIW
— BCCI (@BCCI) October 23, 2019
అరంగేట్ర టెస్టులోనే శతకం..
1996లో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టుతో గంగూలీ అరంగేట్రం చేశాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే శతకంతో విజృంభించాడు. అదే సిరీస్‌లోని తర్వాతి టెస్టులోనూ సెంచరీ సాధించాడు. ఇలా తొలి రెండు మ్యాచ్‌ల్లోనే శతకాలు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగానూ నిలిచాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రెండు చేతులతో ఆడగల సవ్యసాచి..
గంగూలీ అనగానే ఎడమ చేతి వాటం బ్యాటింగ్.. ఆఫ్ సైడ్ దిశగా అతడు కొట్టే కవర్ డ్రైవ్‌లే గుర్తుకువస్తాయి. అయితే సౌరభ్ కుడి చేత్తోనూ బ్యాటింగ్ చేయగలడు. చాలా మ్యాచ్ల్లోఇలానే ఆడి సవ్యసాచి అనిపించుకున్నాడు.
ప్రపంచకప్‌లో ఇప్పటికీ దాదానే కింగ్..
వరల్డ్‌కప్ టోర్నీల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డు సాధించాడు గంగూలీ. 1999 ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 183 పరుగులతో విజృంభించాడు. ఇందులో 17 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఇప్పటికీ మెగాటోర్నీలో ఓ భారత ఆటగాడి అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు ఇదే. ఈ మ్యాచ్‌లో ద్రవిడ్‌తో కలిసి 318 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. ఫలితంగా శ్రీలంకపై 157 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది టీమిండియా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
లార్డ్స్‌లో చొక్కా విప్పిన వేళ...
2002లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన నాట్‌వెస్ట్ వన్డే సిరీస్‌ను భారత క్రికెట్ ప్రేమికులు అంత త్వరగా మర్చిపోలేరు. లార్డ్స్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టును ఓడించింది టీమిండియా. ఆ మ్యాచ్‌లో 326 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. గంగూలీ (60), కైఫ్ (87*), యువరాజ్(69) అర్ధశతకాలతో రాణించి జట్టును గెలిపించారు. ఈ ఉత్కంఠ విజయం అనంతరం గంగూలీ... తన చొక్కా విప్పి గాల్లోకి ఎగరేసి సందడి చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
చివర్లో గాడి తప్పిన బ్యాటింగ్..
ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడి టీమిండియా జైత్రయాత్రలో ఎనలేని పాత్ర పోషించిన గంగూలీ.. మెల్లమెల్లగా బ్యాటింగ్‌లో విఫలమవుతూ వచ్చాడు. 2003 ప్రపంచకప్ అనంతరం ఫామ్ కోల్పోయాడు. 2005 పాకిస్థాన్ సిరీస్‌లో ఘోరంగా విఫలమైన సౌరభ్.. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. తర్వాత స్థానాన్నీ కోల్పోయాడు. జట్టులోకి వస్తూ, పోతూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. 2007లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
అగ్రశ్రేణి ఆటగాళ్లను పరిచయం చేసిన దాదా
యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, గౌతమ్ గంభీర్, మహేంద్రసింగ్ ధోనీ లాంటి అగ్రస్థాయి ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెట్‌కు పరిచయం చేశాడు దాదా. సౌరభ్ కెప్టెన్‌గా వచ్చిన తర్వాతే టీమిండియా క్రికెట్ రూపురేఖలు మారాయి.
113 టెస్టులు ఆడిన గంగూలీ 7212 పరుగులు చేశాడు. ఇందులో 16 శతకాలు, 35 అర్ధసెంచరీలు ఉన్నాయి. 311 వన్డేల్లో 11,313 పరుగులు చేశాడు. ఇందులో 22 శతకాలు, 72 అర్ధసెంచరీలు ఉన్నాయి.
గంగూలీ రికార్డులు..
- వరుసగా నాలుగు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఏకైక ఆటగాడు దాదా.
- ప్రపంచకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు(183) నమోదు చేసిన భారత క్రికెటర్.
- వన్డేల్లో 10వేల పైచిలుకు పరుగులు, వందకు పైగా వికెట్లు, వందకు పైగా క్యాచ్‌లు అందుకున్న ఐదుగురు క్రికెటర్లలో సౌరభ్ ఒకడు.
- తొలి టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేసి, చివరి మ్యాచ్‌లో మొదటి బంతికే ఔటైన ఏకైక బ్యాట్స్‌మన్ గంగూలీనే.