వెస్టిండీస్ మాజీ పేసర్ ఎజ్రా మోస్లీ.. రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. సైకిల్‌పై వెళ్తున్న ఈ 63 ఏళ్ల మాజీ బౌలర్‌ను ఓ ఎస్యూవీ వాహనం ఢీకొట్టింది. 2016 టీ20 ప్రపంచకప్ గెలుపొందిన మహిళల జట్టుకు ఈయన సహాయక కోచ్‌గా ఉన్నారు.
"కింగ్స్టన్లోని ఓ జంక్షన్ వద్ద సైకిలుపై వెళ్తున్న మోస్లీని ఎస్యూవీ వాహనం ఢీకొట్టింది" అని ఓ మీడియా సంస్థ తెలిపింది. కాగా, మోస్లీ వెస్టిండీస్ తరఫున రెండు టెస్టులతో పాటు తొమ్మిది వన్డేలు ఆడాడు.
"ఘోర రోడ్డు ప్రమాదంలో ఎజ్రా మోస్లీ మరణించాడనే వార్త మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. విండీస్ క్రికెట్ బోర్డు విషాదంలో మునిగిపోయింది" అని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ జిమ్మీ ఆడమ్స్ పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: పాక్‌పై కుంబ్లే 'పది వికెట్ల రికార్డు'కు 22 ఏళ్లు