ETV Bharat / sports

స్వీయ నిర్బంధంలో సంగక్కర, గిలెస్పీ - కరోనావైరస్ లక్షణాలు

కరోనా నేపథ్యంలో క్రీడాకారులందరూ ఇంటికే పరిమితమయ్యారు. విదేశీల నుంచి స్వదేశం చేరుకున్న కొందరు ఆటగాళ్లు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. శ్రీలంక దిగ్గజ ఆటగాడు సంగక్కర, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గిలెస్పీ సెల్ఫ్ క్వారంటైన్​లో ఉన్నారు.

సంగక్కర
సంగక్కర
author img

By

Published : Mar 23, 2020, 1:41 PM IST

శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కర స్వీయ నిర్బంధంలోకి వెళ్లాడు. కరోనా వ్యాప్తి కారణంగా ఆ దేశ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. తనకు వైరస్ లక్షణాలు ఏమీ లేవనీ, కానీ ప్రభుత్వ ఆదేశాలను పాటించడం తన బాధ్యతని తెలిపాడు.

"నాకు కరోనాకు సంబంధించిన లక్షణాలు ఏమీ లేవు, కానీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఫాలో అవుతున్నా. వారం క్రితం లండన్​ నుంచి వచ్చా. ఓ న్యూస్​లో చూసి క్వారంటైన్ విషయం తెలుసుకున్నా. పోలీసుల వద్ద రిజిస్టర్ చేయించుకుని స్వీయ నిర్బంధంలో ఉంటున్నా."

-సంగక్కర, శ్రీలంక మాజీ క్రికెటర్

గిలెస్పీ కూడా స్వీయ నిర్బంధంలోనే

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జాసన్ గిలెస్పీ కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాడు. ఇంగ్లాండ్​లో కొద్ది రోజుల పాటు అన్ని క్రీడలను రద్దు చేయగా స్వదేశం చేరుకున్న గిలెస్పీ సెల్ఫ్ క్వారంటైన్​​లో ఉంటున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఇంగ్లీష్ కౌంటీ జట్టు అయిన ససెక్స్​కు కోచ్​గా పనిచేస్తున్నాడీ ఆటగాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.