2017 మహిళా ప్రపంచకప్‌లో ఫైనల్ చేరిన మహిళా టీమ్ఇండియా ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. అప్పటి నుంచే దేశంలో మహిళల క్రికెట్‌కు ఆదరణ మరింత పెరిగింది. అయితే తాజాగా ఈటీవీ భారత్‌తో ముచ్చటించిన ప్రపంచ కప్ విజేత ఇంగ్లాండ్ కోచ్ మార్క్ రాబిన్సన్.. ఈ విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. మహిళా టీమ్ఇండియాను ప్రశంసించాడు. ఫైనల్‌కు చేరడమంటే బాగా ఆడినట్లేనని కొనియాడాడు. ఒకవేళ భారత్ ఆ టోర్నీ విజేతగా నిలిస్తే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పాడు.
ప్రపంచకప్‌లో ఫైనల్ చేరడం వల్ల మహిళా టీమ్ఇండియాలో ఆత్మవిశ్వాసం, నమ్మకం పెరిగింది. ఒక వేళ ఆ టోర్నీలో భారత్ గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. భారత్‌లో మహిళా క్రికెట్ ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది.
-రాబిన్సన్, ఇంగ్లాండ్ మాజీ కోచ్.
ఓ సారి ఆలోచించాల్సింది
మహిళా బిగ్‌బాష్ లీగ్, మహిళా ఐపీఎల్ ఓకేసారి జరగనున్నాయి. ఈ విషయం గురించి రాబిన్సన్ మాట్లాడుతూ.. మహిళా బిగ్‌బాష్ లీగ్ జరిగే సమయంలో మహిళా ఐపీఎల్ నిర్వహించడం సరికాదన్నాడు. ఆ తేదీల్లో నిర్వహించే ముందు భారత క్రికెట్ బోర్డు ఓ సారి ఆలోచించి ఉంటే బాగుండేదన్నాడు.
దీంతో పాటు 2020 సంవత్సరం.. తమ దేశపు మహిళా క్రికెట్‌కు సంబంధించిన అన్ని ప్రణాళికల్ని నాశనం చేసిందన్నాడు రాబిన్సన్. ఈ ఏడాది ఎక్కువ టోర్నీలు ఆడలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు.
ఇదీ చూడండి రోహిత్ శర్మను అందుకే ఎంపిక చేయలేదా?